Read News in Telugu Language
adsdaksha

ప్రజావాణిలో 10 స్పెషల్ కౌంటర్లు.. నెక్ట్స్ వీక్ నుంచే అమలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 3

ప్రజా భవన్ లో ప్రతివారం మంగళ, శుక్రవారాల్లో జరిగే ప్రజావాణికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చి తమ సమస్యలపై అర్జిలు ఇస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రజావాణికి క్యూ కడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నందున ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య తెలిపారు. భూ కబ్జా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, గృహహింస తదితర సమస్యలపై అధికంగా ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read also: ఖర్గే, పీయూష్ మధ్య వార్.. రాజ్యసభలో హాట్ హాట్ గా చర్చ..

వచ్చే వారం నుంచి మరో 10 విభాగాలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక కౌంటర్ల ను ప్రజా వాణి లో ఏర్పాటు చేయబోతున్నామని దివ్య వెల్లడించారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వేదిక లేకుండా పోయింది. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. నేరుగా ముఖ్యమంత్రి కలసే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దొరల పాలనకు ప్రజలు చమరగీతం పాడిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజా భవన్ లో స్వయంగా ప్రజలను కలిసి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు.

Hospital

Read also: 10న రాష్ట్ర బడ్జెట్.. రేపు కేబినెట్ భేటీ..

ప్రజా వాణి కి మొదటి రోజు నుండే అనూహ్య స్పందన రావడంతో.. ప్రభుత్వం దానిని కొనసాగిస్తోంది. ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రియార్టీ ఇస్తున్నారు. ఈ క్రమంలో అధిక ఫిర్యాదులు వస్తున్న పది విభాగాల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Leave A Reply

Your email address will not be published.