Read News in Telugu Language
adsdaksha

ప్రజావాణికి తాత్కాలిక బ్రేక్‌.. జూన్‌ 7 నుంచి పున: ప్రారంభం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

ప్రజల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌ ( prajabhavan ) లో నిర్వహించే ప్రజావాణి ( prajavani )  కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. జూన్‌ 7 నుంచి తిరిగి యథాతథంగా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని నోడల్‌ అధికారి తెలిపారు.

Hospital

read also : dell : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షాక్ .. ప్రముఖ కంపెనీ డెల్ నోటీసు..

మరోవైపు ధరణి స్పెషల్ డ్రైవ్ కూడా  తాత్కాలికంగా బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు. ఎనికల కోడ్ ముగిసిన తర్వాత  ప్రజావాణి, ధరణి స్పెషల్ డ్రైవ్ లాంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.