Read News in Telugu Language
adsdaksha

dsp praneeth rao : ప్రణీత్ రావు కేసులో ప్రత్యేక దర్యాప్తు .. కీలక సమాచారం సేకరించిన పోలీసులు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

ఎస్ ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ( praneeth rao ) కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగిస్తోంది. ఏడు రోజుల కస్టడీలో మూడో రోజు పోలీసులు కీలక సమాచారం సేకరించారు. బంజారాహిల్స్ ( banjarahils ) పీఎస్‌లో విచారణ జరుపుతున్న పోలీసులు మీడియాకు కనిపించకుండా పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేశారు. అతనితో పాటు ఎస్‌ఐబీ ( sib ) లో పనిచేసిన ఇన్‌స్పెక్టర్ స్థాయి నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకు అధికారులను విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు. వారు చెప్పిన దాని ఆధారంగా ప్రణీత్ ను ప్రశ్నిస్తున్నారు.

read also : all india services : సివిల్స్ ‘ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. ఇదే కొత్త తేదీ….

డిసెంబర్ 4న సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఎవరు సహకరించారని ప్రణీత్‌ను అధికారులు ప్రశ్నించగా.. ఎవరి ఆదేశాల మేరకు ధ్రువపత్రాలు, ఐఎంఈఐ నంబర్లు, సీడీఆర్, ఐపీ అడ్రస్‌ల డేటాను సేకరించారో చెప్పినట్లు తెలుస్తోంది. ధ్వంసం చేసి కొత్తవి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించగా.. ప్రణీత్ మౌనంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వికారాబాద్ అడవుల్లో డంప్ చేసిన హార్డ్ డిస్క్‌లను సేకరించాలని భావిస్తున్నారు. ఇందులో ప్రణీత్ రావు స్వయంగా అడవుల్లో పడేసిన ప్రాంతంలో పోలీస్ లు గాలింపు చేస్తున్నారు.

Hospital

read also : ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలి : ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్..

ఇద్దరు సీఐలు అరెస్టు ..

ఫోన్ ట్యాపింగ్ కేసుకు సబంధించి ఇద్దరు సీఐలను వరంగల్ లో పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో పాలుపంచుకున్నారని అనుమానిస్తున్న ఇద్దరు సీఐలను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు మంగళవారం ఉదయం హైదరాబాదుకు విచారణ నిమిత్తం తరలించారు. ఆ ఇద్దరు అధికారులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గంలో పనిచేసినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా నల్గొండ జిల్లాలో సీఐగా ఉన్న ఓ అధికారి పాత్రపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రణీత్‌ రావుతో కలిసి పనిచేసిన మరికొందరిని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 

Leave A Reply

Your email address will not be published.