Read News in Telugu Language
adsdaksha

ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌ ఏప్రిల్ 8కి వాయిదా ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 3

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు బెయిల్ పిటిషన్‌ను బుధవారం నాంపల్లి ( nampalli ) కోర్టు విచారించింది. ప్రణీత్ రావు ( praneeth rao ) బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అయితే కౌంటర్‌లో ఏప్రిల్ 8న వాదనలు వింటామని చెబుతూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు ఇదే కేసులో రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాలరావును పోలీసులు విచారిస్తున్నారు. బంజారాహిల్స్‌ స్టేషన్‌లో డీసీపీ విజయ్‌కుమార్‌, జూబ్లీహిల్స్‌ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.

Hospital

read also : ఆసక్తి కరంగా రాహుల్ గాంధీ ప్రసంగం.. వయనాడ్ లో నామినేషన్ దాఖలు..

వేణుగోపాలరావు విచారణ తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే భుజంగరావు, తిరుపతిలకు ఏప్రిల్ 6వ తేదీ వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ చంచల్ గూడ జైలులో ఉన్నారు.

వేణుగోపాలరావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు SIBలో అదనపు ఎస్పీ( osd )గా వేణుగోపాలరావును నియమించారు. ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులతో పాటు వేణుగోపాలరావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు.

Leave A Reply

Your email address will not be published.