Read News in Telugu Language
adsdaksha

ప్రణీత్‌రావుకు 7రోజుల పోలీసు కస్టడీ ..అనుమతినిచ్చిన నాంపల్లి కోర్టు ..

దక్ష న్యూస్, వరంగల్ : మార్చి 17

మొబైల్ ఫోన్ ట్యాపింగ్, సాక్ష్యాల తారుమారు కేసులో స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు ( praneeth rao ) ను పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఏడు రోజుల పాటు విచారించేందుకు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు నాంపల్లి ( nampalli ) కోర్టు వారం రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీకి అనుమతించడంతో ఆదివారం ఉదయం చంచల్‌గూడ ( chanchalguda ) జైలు నుంచి ప్రణీత్ రావును పంజాగుట్ట ( panjagutta ) పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ ( hyderabad ) పోలీసులు ఈనెల 13న న్యాయస్థానానికి సమర్పించిన రిమాండు నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.

Hospital

read also : బీఆర్ఎస్ కు ఆరూరి గుడ్ బై ..బీజేపీలో చేరే ఛాన్స్…

ప్రణీత్ రావు తనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేసినట్టుగా తేలింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని తన పెన్ డ్రైవ్స్‌లో సేవ్ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. మరోవైపు ప్రధానంగా ప్రణీత్‌రావు ఈ పని చేయడానికి కారణం ఏంటి..? పోలీసు శాఖలో ఏయే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.? పొలిటికల్ లీడర్ల జోక్యం ఉందా..? సేకరించిన డాటా ఎవరికి పంపించారు..? తదితర విషయాలపై పోలీసులు ఆరా తీయనున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.