Read News in Telugu Language
adsdaksha

ఖమ్మంలో అట్టహాసంగా ప్రారంభమైన ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ..

దక్ష న్యూస్, ఖమ్మం: జనవరి 05

హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల కార్పొరేట్ వైద్యానికి ధీటుగా ఖమ్మంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి ( minister ) తుమ్మ నాగేశ్వరరావు ( tummala nageswararao ) అన్నారు. శుక్రవారం ఖమ్మం ( khammam ) నగరంలోని నెహ్రు నగర్ లో ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ( prashanthi super speciality hospital )  నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి హాస్పటల్ సేవలను మంత్రి తుమ్మల కొనియాడారు. అన్ని విభాగాలకు సంబంధించి అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని అందుకు సంబంధించి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని అన్నారు.

read also : t 20 : టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్‌ను ప్రకటించిన ఐసీసీ..

Hospital

ప్రశాంతి హాస్పిటల్ లో పేద మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.  అనంతరం ప్రశాంతి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ భరత్ బాబు మాట్లాడుతూ పదేళ్లుగా కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా వైద్యం అందించామని, కరోనా లాంటి సమయంలోనూ ప్రాణాలను పణంగా పెట్టి అనేకమంది ప్రాణాలను కాపాడమని తెలిపారు. గతంలో ఖమ్మంలో క్రిటికల్ కేర్ అంటే హైదరాబాదు లేక విజయవాడ ఆసుపత్రికి రోగులను తీసుకొని వెళ్లే వారని, మార్గం మధ్యలోనే వైద్యం అందక అనేకమంది మృతి చెందిన సంఘటనలు చూసి ఖమ్మంలోనే ప్రశాంతి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాం అన్నారు.

read also : నూతన హై కోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ..

అందుకే రోగుల ప్రాణాలను కాపాడేందుకు శక్తివంచన లేకుండా తక్కువ ఖర్చుతో పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకుంటూ వారికి అండగా నిలుస్తున్నాం అని డాక్టర్ భరత్ బాబు వివరించారు. ఈ 10 ఏళ్లలో మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే అండగా నిలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు ఖమ్మం మేయర్ నీరజ, కార్పొరేటర్ కమర్తపు మురళి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వడ్డెబోయిన నరసింహారావు, సాదు రమేష్ రెడ్డి, ఐఎంఏ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డా. కంభంపాటి నారాయణరావు, డా. జగదీష్ బాబు, ఆర్ఎంపీల సంఘం జిల్లా నాయకులు, ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, ఆసుపత్రి యాజమాన్యం ప్రశాంతి హాస్పటల్ వైద్యులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.