Read News in Telugu Language
adsdaksha

greece : గ్రీస్ లో నలభై ఏళ్ళ తర్వాత భారత ప్రధాని పర్యటన..

భావోద్వేగానికి గురైన భారతీయులు..

భారత ప్రధానమంత్రి మోదీ గ్రీస్‌ ( Greece ) పర్యటనలో అక్కడి భారతీయ సంఘం సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. నలభై ఏళ్ల తర్వాత మొదటిసారి భారత ప్రధాని ( Prime Minister of India ) గ్రీస్ పర్యటనకు రావడంతో పట్టలేని సంతోషంతో భారత్ మాతా కీ జై, వందేమాతరం, మోదీ జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం కనిపించింది. శుక్రవారం గ్రీస్ దేశ పర్యటనకు వెళ్ళిన ప్రధాని మోదీ ( Prime Minister modi ) ఏథెన్స్‌ ( athens ) లో అడుగుపెట్టగానే గ్రీస్‌లోని భారతీయులు హోటల్ వెలుపల ఘనస్వాగతం పలికారు. గ్రీస్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సోటాకిస్‌ ( kyriakos mitsotakis ) ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ గ్రీస్ దేశంలో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన పట్ల గ్రీస్‌ దేశం ఏథెన్స్‌లోని భారతీయులు హర్షం వ్యక్తం చేశారు.

read also : చందమామ పై మూన్ వాక్.. ప్రజ్ఞాన్ రోవర్ చిత్రాలు విడుదల..

Hospital

ప్రధాని మోదీకి గ్రీస్‌ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు స్టార్టప్ గ్రీస్ ఆర్గనైజేషన్ మేనేజింగ్ డైరెక్టర్ థానోస్ పారాషోస్ హాజరయ్యారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ, మోదీజీకి ఆహ్వానం పలికేందుకు ఇక్కడకు వచ్చాను. గత తొమ్మిదేళ్లలో ప్రపంచానికి అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో మేం అద్భుతమైన పురోగతి సాధించాం అని చెప్పారు. గ్రీస్ నివాసి దల్జీత్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఇక్కడికి వస్తున్నారని తెలిసి వచ్చాం. భారత ప్రధాని ఇక్కడకి రావడం మాకు ఆనందంగా ఉంది.. పాకిస్థాన్‌ పరిధిలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవడం మోదీ గొప్పతనం, మోదీకి మేం భాంగ్రా నృత్యంతో స్వాగతం పలికాం అని చెప్పారు.

read also : పాశ్చాత్య ఆవిష్కరణలు మన వేదాల్లోనివే.. ఇస్రో శాస్త్రవేత్త సంచలన వ్యాఖ్యలు..

ప్రధానమంత్రి మోదీ తన పర్యటనలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి గ్రీస్ దేశానికి బయలుదేరి వచ్చారు. గ్రీక్ ప్రధాని కైరియాకోస్ మిత్సోటాకిస్‌తో మోదీ సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పటిష్ఠం చేసే మార్గాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. ఇరు దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతోనూ మోదీ సంభాషించనున్నారు. అతను గ్రీస్‌లోని భారతీయ సభ్యులతో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.