Read News in Telugu Language
adsdaksha

యూనివర్శిటీల్లో రిజర్వేషన్ల అమలుకు చట్టం చేయడానికి సిద్దం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 30

మన ఊరు-మన బడి నిధుల వినియోగంపై విచారణకు ఆదేశం..

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ..

రాజ్యాంగబద్దంగా ఉండాల్సిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీలు ఇష్ఠారాజ్యంగా నడిపించుకోవడం సరైంది కాదని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ( cm revanth reddy ) అన్నారు. ప్రైవేటు యూనివర్సిటీ ( private universities ) ల మార్గదర్శకాలపై సమగ్రంగా విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ( reservation ) కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, రాష్ట్రంలోని ప్రైవేటు యూనివర్సిటీలలోనూ రిజర్వేషన్లు అమలుచేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతులు, మార్గదర్శకాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు, విద్యార్థుల సంఖ్య, వసూలు చేసిన ఫీజులు, ఫీజు రీయంబర్సుమెంటు, టీచింగ్ సిబ్బంది, నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నింటిపైనా నివేదిను ఇవ్వాలని సీఎం ( cm ) అధికారులను ఆదేశించారు.

Hospital

read also : ఒక కుటుంబానికి ఒకే దరఖాస్తు.. మధిర గ్రామ సభలో కలెక్టర్ వి.పి. గౌతమ్..

మౌళికవసతులు, అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలు అందిస్తున్నాయో నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇండ్ల ప్లాట్లకు రిజిష్ట్రేషను అయిన భూములను, ధరణిలో చూపించినా ప్రైవేటు యూనివర్సిటీకి అనుమతిని ఇచ్చారని, అలాంటివాటిలో ఎలాంటి విద్యను అందిస్తున్నాయనే నివేదికను ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇండ్ల స్థలాల కింద రిజిష్ఠరు అయిన, వివాదంలో ఉన్న భూముల్లో యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వీటిపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు.

read also : ATA : ఆటా ఆధ్వర్యంలో భారీ సేవ కార్యక్రమాలు..

యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజీ వ్యవహారం వల్ల గత విద్యాసంవత్సరంలో చాలామంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధులతో మన ఊరు-మన బడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద ఇప్పటిదాకా జరిగిన నిధుల వినియోగంపైనా సమగ్రంగా విచారణ జరిపి, నివేదికను ఇవ్వాలని అధికారులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.