Read News in Telugu Language
adsdaksha

రేపే పిఎస్ఎల్‌వీ-సీ58 ప్రయోగం.. కౌంట్‌డౌన్ ప్రారంభం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : డిసెంబర్ 31

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 2024 కొత్త ఏడాది తొలి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ శ్రీహరికోట,లో కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియ 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ ఎల్‌వీ-సి58 ( pslv – c58 ) వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌పో శాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది.

read also : డా.కావ్యచంద్ యలమూడి కి ‘వైద్య శ్రీ 2023 అవార్డు ..

Hospital

పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్ల నుంది. ఎక్స్‌పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచల నాత్మక పురోగతికి నాంది కానుంది. ఇమేజింగ్‌, టైం-డొ మైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రో స్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా.. ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ,ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌పో శాట్‌ లక్ష్యం. ఈ ఉపగ్రహ జీవిత కాలం అయిదేళ్లు. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్ల నుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌పెరిమెంటల్‌ మాడ్యూల్‌ పీవోఈఎం అని నామ కర ణం చేశారు. మరోవైపు పీఎ స్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం నేపథ్యంలో తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు.

read also : అంచనాలు పెంచుతున్న దేవర .. అనిరుధ్ ట్వీట్ తో సర్వత్రా ఆసక్తి..

ఆదివారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఇస్రో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. పీఎస్‌ఎ ల్‌వీ-సి58, ఎక్స్‌పోశాట్‌ నమూనా చిత్రాలను శ్రీవారి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మంత్రి నారాయణ రాణె సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.