Read News in Telugu Language
adsdaksha

తల్లాడ జిల్లా పరిషత్ పాఠశాలలో అపూర్వ సమ్మేళనం..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 16

గురువులకు ఘన సన్మానం..

తల్లాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-06 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు మంగళవారం ఆ పాఠశాలలో పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ( purva vidyardula sammelanam ) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 17 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

read also : వందేభారత్ ప్రోమో రిలీజ్.. ఇదేం గొడవ భయ్యా.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ట వేళ..

Hospital

పూర్వ విద్యార్ధుల సమ్మేళనం కార్యక్రమం సందర్భంగా 17 ఏళ్ళ క్రితం అక్కడ పదో తరగతి చదివిన విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చారు. పాఠశాల వేదికగా చిన్ననాటి స్నేహితులంతా కలుసుకొని తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి గురువులు ప్రధానోపాధ్యాయులు శివరామకృష్ణ, రామారావు, అక్బర్, కాలేశ్వర రావు, రమణలను శాలువాలు పూలమాలలతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పటి విద్యార్థులమంతా వివిధ రంగాల్లో స్థిరపడటం సంతోషకరమన్నారు. విద్య ద్వారానే బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకోవచ్చునని అది తమ ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైందన్నారు. అనంతరం సంహపక్తి భోజనాలు చేసి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు.

read also : బల్లెమో.. బాణమో.. అయోమయంలో ఆంధ్రా ప్రజలు.. మారనున్న ఏపీ రాజకీయ ముఖ చిత్రం..

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గొల్లమందల నాగబాబు, అప్పారావు, మురళి, సురేష్, నరేష్, కామేశ్వరి, అనూష, నాగమణి, శంకర్, అశోక్, నాగరాజు, బాలకృష్ణ, సురేష్, శైలజ, తిరుపతమ్మ, నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.