Read News in Telugu Language
adsdaksha

ప్రభుత్వ పధకాల అమలులో ఖమ్మం జిల్లా ది అగ్రస్థానం..

- స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

స్వాతంత్ర పోరాటంలో ఖమ్మం జిల్లాకు విశిష్ట స్థానం ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar) అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాలలో ఖమ్మం జిల్లా ( khammam district) అగ్రగామిగా నిలుస్తుందన్నారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆయన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధి నిర్దారణకు గాను రెండు కోట్ల 15 లక్షల రూపాయిలతో సి.టి స్కాన్ ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 161 పల్లె దవాఖానాలు, 09 బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు.

read also : గుండెల నిండుగా జెండా పండుగ..

Hospital

బనిగండ్లపాడు ఆరోగ్య కేంద్రానికి రూ. కోటి 56 లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో 115 పాఠశాలలకు ప్రతి పాఠశాలకు 9 లక్షల ఖర్చుతో 8,9,10 తరగతులకు డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన వారందరికీ ప్రతి నెలా 15 వందల మందికి బి.సి బందు అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొట్టమొదటి సోలార్ కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేశామని, ఖమ్మం – సూర్యాపేట రహదారి రూ. 15 వందల 66 కోట్లతో 58.62 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం పూర్తి చేశామన్నారు. చింతకాని మండలంలో 3462 మంది లబ్దిదారులకు దళితబందు మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2015 నుండి ఇప్పటి వరకు 8956 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. వంద కోట్లతో గోళ్ళపాడు ఛానల్ ను ఆధునీకరించామని, రూ. 4కోట్ల 50 లక్షలతో ఇల్లందు క్రాస్ రోడ్డు లో ఆధునిక మార్కెట్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు. జి.ఓ 58, 59 ప్రకారం ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఇండ్లను క్రమబద్దికరిస్తున్నట్లు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.