Read News in Telugu Language
adsdaksha

భద్రాద్రి కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: ఆగస్ట్ 24

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..

కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ (brs) ప్రభుత్వానిదే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. గురువారం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో రూ.135 కోట్ల తో చేసిన అభివృద్ధి పనులకు మంత్రి స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ( vanama venkateswararao ) తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ, వార్డుల అభివృద్ది కోసం కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వంలో అయినా వచ్చాయా..? ఎవరైనా ఇచ్చారా.. అది కేవలం తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు.

read also : మంత్రి మల్లన్న ఎంపీ నామాలే నాకు ఆదర్శం..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Hospital

కొత్తగూడెం ప్రజలకు ఎమ్మేల్యే వనమా ఉండటం వరమని, ప్రజల కోసం ఇన్ని కోట్లు తీసుకురావడం వారికే సాధ్యమైందన్నారు. పాల్వంచలో రూ.60కోట్లు, కొత్తగూడెంలో 75 కోట్లతో నాతో శంకుస్థాపన చేయించారు.. ఇన్ని నిధులు ఎప్పుడూ చూడలేదు.. కొత్తగూడెంలో పేరులోనే కొత్త ఉండేది.. ఊరులో లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ వార్డుల అభివృద్ది కోసం నీళ్ళు పారబోసినట్టే నిధులు పోస్తున్నారన్నారు. ప్రజలకు అన్ని సౌకర్యాలు, సెంట్రల్ లైటింగ్ లు, సెంట్రల్ డివైడర్ లు, రోడ్లు, కాల్వలు, పార్కులు ఇలా అనేక పనులకు నిధులు ఇస్తున్నారన్నారు. అభివృద్ధి బిఆర్ఎస్ ( BRS) ప్రభుత్వంతోనే సాధ్యం అని, రాబోయే రోజుల్లో కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలుగా కలిసిపోతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మెదక్ లో చెప్పిన విధంగా ప్రజలు నిబ్బరంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మంచి పాలనను మళ్ళీ ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

కొత్తగూడెం అభివృద్ది జరగాలంటే ఇక్కడ వనమా ను గెలిపించాలని, BRS ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టాలన్నారు. అనంతరం కొత్తగూడెం జిల్లాలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

read also : Randomisation Software : సాంకేతిక పరి జ్ఞానం తో లబ్దిదారుల ఎంపిక..

Leave A Reply

Your email address will not be published.