Read News in Telugu Language
adsdaksha

మంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంన్నా.. ఐదో యేడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆశీర్వదించి పంపండి..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 2

ఈనెల 8కి మంత్రిగా పదవీబాద్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్నా.. ఐదో యేడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఆశీర్వదించి పంపండి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. నాలుగేళ్ళలో నాలుగు దిక్కుల్ని అభివృద్ధి చేసుకున్నాం, మరో అవకాశం ఇస్తే ఖమ్మం ( khammam )  నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందన్నారు. శనివారం ఖమ్మం అల్లిపురం మినీ ఫంక్షన్ హాల్ లో అసెంబ్లీ నియోజకవర్గ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అద‌నంగా రాష్ట్రం రేషన్ కోటాను ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ ( telangana ) రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రేషన్ కోటాను పెంచి ఇస్తోందని అన్నారు. రేష‌న్ డీల‌ర్ల‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) అక్కున చేర్చుకున్నారని, తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలోని రేషన్ డీలర్ కు గుర్తింపు లభించిందన్నారు.

read also : అంబరాన్నంటిన వజ్రోత్సవ సంబురం.. ఆకట్టుకున్న సాంస్కృతిక సంరంభం..

గత ప్రభుత్వ హయాంలో క్వింట కు రూ.20 ఉండగా తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఎన్నికైన తర్వాత రూ.70 కి పెంచారన్నారు. అనంతరం ఆగస్ట్ నెలలో రూ.140 కి పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఅర్ నిర్ణయించి అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణ‌యం వల్ల రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప్ర‌తి ఏడాది అద‌నంగా రూ.139కోట్ల భారం ప‌డినప్పటికి మీ కళ్లల్లో సంతోషం చూడాలనే సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్పుడు మెట్రిక్ టన్నుకు రూ. 200 క‌మీష‌న్ ఉండేదని, ఆ క‌మీష‌న్‌ను కేసీఆర్ స‌ర్కార్ రూ. 1400కు పెంచిందన్నారు.

Hospital

రాష్ట్రంలోని 90.05లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అద‌నంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కమీషన్ సైతం కేంద్రం పెంచకున్నా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందిస్తోందన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీ ద్వారా ప్రతి పేద వాడి ఇంటికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయగలిగామన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న తిండి గింజలు మీరే అందజేస్తారని అన్నారు. BRS ప్రభుత్వం సకల జనులు, సకల వర్గాల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో ఉందని, చిన్న, సన్న కారు ఉద్యోగుల వేతనాలు పెంచి వారి కుటుంబాలను అదుకున్నారని అన్నారు. రేషన్ డీలర్ ల సమస్యను గుర్తించి వారి సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ కి, మంత్రి హరీష్ రావు కి ధన్యవాదాలు తెలిపారు.

read also : cm kcr : గాంధీ మార్గంలో ఉద్యమించడం వల్లే రాష్ట్ర స్వప్నం సాకారమైంది..

ఇప్పటికే ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్నాం అని మంత్రి పువ్వాడ అన్నారు. అంగన్వాడీ, సాంస్కృతిక సారథులు, VOA ఇలా అనేక ఉద్యోగుల ఆదాయం పెంచిన మహనీయుడు కేసీఅర్ అని అన్నారు. తెలంగాణ రాక ముందు ప్రతి ఇంట్లో ఇన్వర్టర్, జనరేటర్ లు ఉన్న పరిస్థితుల నుండి నేడు ఇంటికి, వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేసిన ప్రభుత్వం ఏదైన ఉంది అంటే అది BRS ప్రభుత్వమే అన్నారు.

 

ఒకప్పుడు ఖమ్మం.. నేడు ఖమ్మం ఎలా ఉంది.. చెప్పాలని మంత్రి పువ్వాడ అన్నారు. ఒకప్పుడు గజం రూ.5వేలు ఉన్న స్థలం నేడు రూ.30వేలు ఉంది అంటే అది మనం చేసిన అభివృద్ది ఫలితమే.. అన్నారు. సెప్టెంబర్ 8వ తేదీకి మంత్రి గా పదవి బాధ్యతలు చేపట్టి 4ఏళ్లు పూర్తవుతున్నాయని, 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నా ఈ ఏడాదిలో వచ్చే ఎన్నికల్లోను మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదించి ఖమ్మాన్ని మరింత అభివృద్ధి పరిచే అవకాశం ఇవ్వాలని కోరారు.

 

రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అద్యక్షుడు ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మక్బూల్, చామాకురి వెంకన్న, నాయకులు పరమేష్, నాయకులు మోటమర్రి చంద్రశేఖర్రావు, ఏకే శేఖర్, గోళ్ళ మురళీ, లగిశెట్టి వెంకటేశ్వర్లు, సుధాకర్, బిచ్చు, ఉమామహేశ్వరరావు, వి. బాబు, శంకర్, కార్యదర్శి ఎస్ మహేశ్, కోశాధికారి నీ బాబు, షేక్ జానీమియా, ఆర్ రాంబాబు, సీహెచ్ ఉపేందర్, జీ వీరభద్రయ్య, ఎస్ వెంకటేశ్వరు, షేర్ ఉస్మాన్, షేక్ బాజామియా తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.