Read News in Telugu Language
adsdaksha

టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శించే వారిని నమ్మకండి..

దక్ష న్యూస్, ఖమ్మం : సెప్టెంబర్ 3

30 ప్లాట్ ఫాం లతో ఖమ్మం బస్టాండ్ ను తీర్చిదిద్దినం..

ఆర్టీసి సంస్థ కు ఆస్తులు క్రియేట్ చేసి సంస్థను బ్రతికించిందే కేసీఅర్..

– రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

ఎన్నికలు వస్తున్నాయని వస్తారు కొందరు.. టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఆదివారం
ఖమ్మం ఆర్టీసీ బస్ స్టాండ్ ( rtc bus stand) ఆవరణలో నిర్మించనున్న కన్వెన్షన్ హాల్ శంకుస్థాపన కు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మం ( khammam ) ప్రజల కోసం ఇక్కడ అద్భుతమైన బస్ స్టాండ్ ఉండాలని దృఢంగా సంకల్పించి దాన్ని పూర్తి చేశాం అన్నారు.

మొదట రూ.10 కోట్లు అనుకున్నది రూ. 30 కోట్లు అయిందని అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి నిర్మాణం పూర్తిచేసినట్లు తెలిపారు. కరోనా క్లిష్ట పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడి నేడు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం కేసిఆర్ 43 వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

read also : మూడు రోజుల్లో క్షేత్ర స్ధాయిలో విచారణ పూర్తవ్వాలి..

Hospital

హైదరబాద్ ( hyderabad ) లోని ఎంజీబిఎస్, జేబిఎస్ (MGBS, JBS) బస్ స్టాండ్ ల తరువాత అంత పెద్ద బస్ స్టాండ్ మన ఖమ్మంలోని ఉందని మంత్రి పువ్వాడ వెల్లడించారు. 30 ప్లాట్ ఫాం లతో అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ఏం చేశావయ్య నీ ఖమ్మం కు అని ఎవరైనా అడిగితే ప్రజలకు అవసరమయ్యే అద్భుతమైన బస్ స్టాండ్ నిర్మాణం చేసినం అని గర్వంగా చెప్తా అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. పక్కనే టూరిజం హోటల్, బహుళ సంస్థల షాపింగ్ మాల్ హోటల్స్ వచ్చాయని, ఆర్టీసి సంస్థల అభివృద్ది కోసం రూ.200 కోట్లు రుణం తీసుకుని అభివృద్ది చేస్తాం అన్నారు. మాల్ అండ్ మల్టీప్లెక్స్ లు, కన్వెన్షన్ హాల్స్ ఇలా కమర్షియల్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 2వేల మందికి సరిపడుగా అధునాతన డిజైన్ తో రూ.40 కోట్లతో కన్వెన్షన్ హాల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఆర్టీసీకి ఆదాయం వస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని మంత్రి అన్నారు. సంస్థను కాపాడటంతో పాటు రవాణా సౌకర్యాలను సులభతరం చేస్తామని చెప్పారు. కొందరు పిచ్చి వెదవలు ఆర్టీసి ఆస్థులపై కేసీఅర్ కన్నేశాడు అని కారుకూతలు కూస్తున్నారు.. ఆ వెదవలకు చెప్తున్నా.. ఆర్టీసి సంస్థ కు ఆస్తులు క్రియేట్ చేసి సంస్థను బ్రతికించిందే కేసీఆర్ రా… కరోనా కష్టకాలంలో ఆర్టీసి మూసే పరిస్థితి వస్తే, ఎక్కడ వెరవకుండా ప్రభుత్వం తరుపున నిధులు మంజూరు చేసి సంస్థను బ్రతికించింది కేసీఆరే అని స్పష్టం చేశారు. కేసీఆర్ కాకుండా ఎవరు ఉన్నా ఈ పాటికే సంస్థను ముసివేసేవారన్నారు. ఆర్టీసి బస్సులు ప్రతి రోజు రూ.6 లక్షల డిజిల్ వినియోగిసస్తున్నట్లు తెలిపారు. ఒక పక్కన నష్టాలు వస్తున్నా ఎక్కడ వెనకడుగు వెయ్యకుండా నిర్విరామంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

read also : గృహలక్ష్మి దరఖాస్తుల విచారణ ముమ్మరం..

ఎన్నికలు వస్తున్నాయని కొందరు వస్తారు.. టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు.. వాళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాళ్ళు జిల్లాకు చేసిన అభివృద్ది ఏమీలేదు. ఒక్క శిలాఫలకం కూడా వేయలేదు. చేస్తే కదా ఉండేది. వాళ్ళు కూడా మాట్లాడతారు.. కేసీఅర్ ను గద్దె దింపుతాం.. బంగళాఖాతంలో కలుపుతామని ప్రేలాపనలు పేలుతున్నారు. ప్రజలే మీ భరతం పడతారు.

ఖమ్మం చైతన్య పరమైన, లిఫ్ట్ అభ్యుదయ భావాలతో ప్రజలు ఉన్నారు.. విజ్ఞులైన ఖమ్మం ప్రజలకు ఎవరు ఏంటో బాగా తెలుసు అని చురకలంటించారు. Brs నగర పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ సెంటర్ లింగాల కమల్ రాజ్, వైస్ చైర్మన్ ధనలక్ష్మి, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, RTC ED (కరీంనగర్ జోన్) వినోద్ కుమార్, కృష్ణకాంత్ (కమర్షియల్), సుడా చైర్మన్ విజయ్ కుమార్, AMC చైర్మన్ దోరేపల్లి శ్వేత, భీరెడ్డి నాగచంద్రా రెడ్డి, RTC RM CH వెంకన్న, కార్పొరేటర్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.