Read News in Telugu Language
adsdaksha

వెల్లువెత్తిన అభినందనలు.. పెల్లుబికిన ఆనందం..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 8

సర్వమత ప్రార్ధనలతో పువ్వాడకు మత పెద్దల ఆశీస్సులు..

నాయకులకు పేరు పేరునా నోరు తీపి చేసిన మంత్రి..

ప్రజాప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సంబరాలు..

తెలంగాణ ( telangana ) రాష్ట్ర మంత్రి గా పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar )  రవాణాశాఖ బాద్యతలు స్వీకరించి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఖమ్మం ( khammam ) పువ్వాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. సర్వమత ప్రార్థనలతో ప్రారంభించిన కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద యెత్తున హాజరయ్యారు. నినాదాలు, కేరింతల మధ్య కేక్‌ కట్ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నాయకులకు, కార్పొరేటర్ లకు ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కొసరి కొసరి కేక్ తినిపించి నోరు తీపి చేసి సంతోషం పంచుకున్నారు.

Hospital

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, జర్నలిస్టులు మంత్రిని కలిసి శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలు అందజేసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా Vdo’s క్యాంపు కార్యాలయంలో భద్రాచలం శ్రీ సీతా రామ చంద్ర స్వామి వారి దేవాలయం నుండి ప్రత్యేకంగా వచ్చిన అర్చకులు మంత్రి పువ్వాడకు వేద మంత్రాలతో ఆశీస్సులు అందించి భద్రాద్రి రామయ్య ప్రసాదాలను అందజేశారు.

reaad also : google : గోదాట్లోకి తీసికెళ్లిన గూగుల్.. కాపాడిన స్థానికులు..

ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్‌ పునుకొల్లు నీరజ, ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, ఎమ్మేల్యే సండ్ర వెంకట వీరయ్య, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, సుడా చైర్మన్‌ విజయ్‌కుమార్‌, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ DV, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఖమ్మం, కొత్తగూడెం RTA మెంబెర్స్ వల్లభనేని రామారావు, గూడపాటి శ్రీనివాస్, కార్పొరేటర్ లు, వివిధ శాఖల ప్రభుత్వం అధికారులు, సిబ్బంది, డివిజన్ నాయకులు, తదితరులు మంత్రికి శాలువాలు కప్పి సత్కరించారు.

జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్‌హసన్‌, ఆర్‌వీఎస్‌ సాగర్‌, నందగిరి శ్రీను, దాసరి రవికుమార్‌, శాబాసు జ్యోతి, స్వప్న తదితరులు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు మంత్రికి శుభాకాంక్షలు చెప్పి కేక్‌ కట్‌ చేయించారు.

Leave A Reply

Your email address will not be published.