Read News in Telugu Language
adsdaksha

మున్నేరు వరద బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం చెక్కుల పంపిణీ..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 10

మున్నేటికి వరద వచ్చిప్పుడు అజయ్ అన్న మీ ఇంటికి వచ్చిండు.. మిమ్మల్ని అన్నివిధాలుగా ఆదుకుంటాం అని చెప్పిండు.. చెప్పిన విధంగానే మీ కోసం ఆలోచించా శాశ్వత పరిష్కారం కోసం సీఎం దృష్టికి తీసికెళ్లి ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం కృషి చేశా అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఆదివారం ఖమ్మం ( khammam ) నయా బజార్ ప్రభుత్వ పాఠశాల అవరణంలో ఏర్పాటు చేసిన సభలో మున్నేరు ( munneru ) ముంపు బాధితులకు రూ.1.50 కోట్ల విలువైన నగదు చెక్కులను అర్హులైన 1,718 మంది కుటుంబాలకు స్వయంగా పంపిణి చేశారు.

read also : ట్యాంక్ బండపై చిట్యాల ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి ..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ, ఐటిసి సహకారంతో రూ.కోటి రూపాయలతో తో గృహ అవసరాలకోసం స్టీల్ సమన్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. తన విజ్ఞప్తి మేరకు ఎంపి బండి పార్థసారథి రెడ్డి రూ.కోటి, తన కోడలు అపర్ణ తాత గారి కంపెనీ నుండి రూ.50 లక్షలు మొత్తం రూ.1.50 కోట్లు కలెక్టర్ గారి అకౌంట్ కు బదలయించి వాటిని పంపిణి చేస్తున్నట్లు వెల్లడించారు. అడిగిన వెంటనే స్పందించిన బండి పార్థసారథి రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. తాను మున్నేరు వరదలో పర్యటించడం టీవీలో చూసిన తన కోడలు చలించి తన తాత గారి కంపెనీ నుండి రూ.50 లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తన కోడలు వయసులో చిన్నది అయినప్పటికీ పేదల పట్ల పెద్ద మనసు చాటుకుందని ప్రశంసించారు.

read also : మున్నూరు కాపులు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పాటు పడాలి..

Hospital

మున్నేరు వరద ముంపు కుటుంబాలు 1,718 గృహాలకు ఒక్కో కుటుంబానికి రూ.8,463 వేలు చొప్పున అందరికీ సమానంగా పంపిణి చేస్తున్నాం అని వివరించారు.  మున్నేరు పరివాహక ప్రాంతంలోని ముంపు బాధితులకు ఇక ఇబ్బందులు రావని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. మున్నేరుకు ఇరువైపులా RCC రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం వేగంగా ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయని, అతి త్వరలో ఆయా పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభిస్తాం అన్నారు.

శాశ్వత పరిష్కారం కోసం రూ.777 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం.. దీనితో పాటు వర్షపు నీరు కు ప్రత్యేక పైప్ లైన్, మురుగు నీరు కోసం ప్రత్యేక లైన్ లు ఎర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచిగా అభివృద్ది చేస్తాం అని తెలిపారు. మున్నేరు పై మారో మూడు చెక్ డ్యాంలు నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. రూ.30 కోట్లతో పద్మావతి నగర్ రంగనాయకుల గుట్ట, ప్రకాష్ నగర్ చెక్ డ్యాం వద్ద మొత్తం మూడు చెక్ డ్యాం లు నిర్మాణం చేపట్టడానికి కేసీఆర్ మంజూరు చేశారు. త్వరలో దాని GO కూడా వస్తుందన్నారు. మున్నేరు పై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పక్కనే రూ.180 కోట్లతో మారో నూతన బ్రిడ్జి నిర్మాణం నిర్మించనున్నట్లు తెలిపారు.

read also : ఖమ్మం నాఇల్లు.. ఇక్కడి ప్రజలు నాకుటుంబ సభ్యులు..

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, ఆర్డీఓ గణేష్, ఎంఆర్ఓ స్వామి, కార్పొరేటర్ లు కమర్తపు మురళి, మాటేటి లక్ష్మీనాగేశ్వరరావు, కన్నం వైష్ణవిప్రసన్న కృష్ణ, ఆర్జేసి కృష్ణ, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.