Read News in Telugu Language
adsdaksha

సాదు కుంటరో.. సంపుకుంటరో మీ ఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 21

అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుండి నేడు ఖమ్మం (khammam ) నగరాన్ని అభివృధ్దిలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా తీర్చి దిద్దామని ఇంతటి అభివృద్ది సాధించిన ప్రభుత్వాన్ని, నన్ను సాదుకుంటరో.. సంపుకుంటరో మీ చేతుల్లోనే ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒకప్పుడు ఖమ్మం నగరం మురికి కూపం లా ఉండేదని, సరైన రోడ్డు వ్యవస్థ, మురుగు వ్యవస్థ, త్రాగునీటి కొరత, అభివృద్ది ప్రణాళిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు గుర్తు చేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే గా తాను గెలిచిన నాటి నుండి ఖమ్మం అభివృద్దిపై ఒక ప్రణాళికతో, చిత్తశుద్దితో పని చేసి ఒక రూపుకు తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. నేడు మనం చూస్తున్న, అనుభవిస్తున్న అభివృద్ది ఎన్నో రోజుల కఠోర శ్రమ, కోట్ల రూపాయల నిధులు సమీరణ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఖమ్మం నగరం నా ఇల్లు, ప్రజలంతా నా కుటుంబ సభ్యులు కాబట్టే నా ఇంటిని శుభ్రం చేసిన మాదిరిగా చెత్త సేకరణ, మురుగు తొలగింపు, రోడ్లు, డ్రైన్లు, ప్రతి రోజూ ఇంటింటికీ త్రాగునీరు సరఫర ఇలా అనేక పనులు చేపట్టి అభివృద్ది చేసుకున్నామని వివరించారు.

read also : పేదలు గొప్పగా బ్రతకాలనే ఆలోచనలకు ప్రతిరూపమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..

Hospital

అభివృద్ది విషయంలో నిబద్దత తో ఉన్నామని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరాభివృద్దిలో భాగంగా చెప్పిన అన్ని పనులు చేశామన్నారు. కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చెప్పనివి కూడా పూర్తి చేశామని, ఖమ్మం నగరానికి వచ్చినన్ని నిధులు ఏ మున్సిపల్ కార్పొరేషన్ కి రాలేదన్నారు. అది కేవలం పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ ని గెలిపించాల్సిన బాధ్యత మీదే అన్నారు.

ఈ నెల 30వ తేదీన మంత్రి కేటిఆర్ ఖమ్మంకు రానున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రూ.1200 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. ఖమ్మం లో ఎవడో గ్యారెంటి కార్డ్ లు ఇస్తాం అంటారు.. దాన్ని నమ్ముకుంటే మనం మళ్ళీ పాత రోజులు చవి చూడాల్సి వస్తుంది.. మన గ్యారెంటి కార్డ్ బిఆర్ఎస్ మాత్రమే అన్నారు. మనకి ఎవరి గ్యారెంటీ అక్కర్లేదు.. మనకు ఇప్పుడు ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ చాలు అని స్పష్టం చేశారు.

read also : హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు..

రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇంతకు రెండింతలు మరింత అభివృద్ది నగర ప్రజలు చూస్తారని మంత్రి పేర్కొన్నారు. వందల కోట్లు ప్రభుత్వం నుండి తీసుకువచ్చి అభివృద్ది చేసుకుందామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ లు చామకూరి వెంకన్న, మేడారపు వెంకటేశ్వర్లు, కురాకుల వలరాజ్, దండా జ్యోతి రెడ్డి, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, నాయకులు ఆర్జేసి కృష్ణ, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, కొల్లు పద్మ, బిచ్చాల తిరుమలరావు, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.