Read News in Telugu Language
adsdaksha

బై..బై.. గణేశా..గణనాథునికి ఘన వీడ్కోలు..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 27

ఖమ్మం ( khammam ) ఎంతో ప్రశాంతమైన వాతావరణం కు మారు పేరని ఇక్కడ ప్రజలంతా ఒక్కటే అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar )  వ్యాఖ్యానించారు. గణేశ్ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ప్రతిష్టించిన గణేష్ విగ్రహాల ఊరేగింపును బుధవారం మంత్రి అధికారిక లాంఛనాలతో ప్రారంభించారు. సామూహిక గణపతి నిమజ్జనం కార్యక్రమానికి మంత్రి అజయ్ కుమార్ త్రీ టౌన్ లోని గాంధీ చౌక్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ ఆయా పండుగలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) అన్నట్లు తెలంగాణ ( telangana ) రాష్ట్రం గంగ జమున తేహాజీబ్ లా అన్ని మతాలవారు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించిన స్తంభాద్రి ఉత్సవ సమితి నిర్వాహకులను మంత్రి అభినందించారు. అనంతరం నిమజ్జన తీరును నిమజ్జన ఏర్పాట్లును పర్యవేక్షించారు.

read also : తెలంగాణ సర్కార్ లోనే రఘునాధపాలెం సమగ్రాభివృద్ధి..

నిమజ్జనంలో ఎక్కడ ఎలాంటి అపశృతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. ఇప్పటికే అన్ని నిమజ్జన కేంద్రాలలో ఏర్పాట్లు చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, వారికి అభినందనలు తెలియజేశారు.

Hospital

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రోత్సహించి, పూజించాలనే ఆకాంక్షతోనే స్థంబాద్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయక మండపాలకు పువ్వాడ ఫౌండేషన్ తరుపున విద్యుత్ చార్జీలు, పోలీస్ పర్మిషన్ ల నిమిత్తం రూ.4 లక్షలు చెల్లించామన్నారు.

వచ్చే ఏడాది నుండి పూర్తి స్థాయిలో మట్టి వినాయకుడినే ప్రతిష్టించి ఆరాధించాలని మంత్రి నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలన్నారు.

read also : పీవీ మార్గ్ లో లేక్ ఫ్రంట్ పార్క్ ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అన్ని పండుగలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. వేలాది మంది పాల్గొనే గణేష్ శోభాయాత్రకు దేశంలోనే ఎంతో ప్రత్యేకత ఉందని మంత్రి అన్నారు. కాల్వఒడ్డులో వివిధ సంస్ధల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత త్రాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రారంభించి ఆయా ఏర్పాట్లు చేసిన వారికి అభినందనలు తెలియజేశారు.

కార్యక్రమంలో ఎంపి నామా నాగేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వేంకటేశ్వర రావు, ఆర్జేసి కృష్ణ, స్థంబాద్రి ఉత్సవ సమితి ప్రతినిధులు వినోద్ లాహోటి, గెంట్యాల విద్యాసాగర్, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.