Read News in Telugu Language
adsdaksha

puvvada : ఖమ్మం నా ఇల్లు .. ఇక్కడి ప్రజలంతా నాకుటుంబ సభ్యులే..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 28

ఖమ్మం నా ఇల్లు.. ఇక్కడ ప్రజలంతా నా కుటుంబ సభ్యులే అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం ( khammam ) నగరం లోని 18వ డివిజన్ ముస్తఫా నగర్ ( musthafanagar )  లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బొమ్మ రాజేశ్వరరావు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడి ప్రజలంతా నా వాల్లే అన్న భావంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఇక్కడ చదువుకుని, ఇక్కడ తిరిగిన వాడ్ని, నా ఇల్లు బావుండలి.. నా ప్రజలకు ఏదైన చెయ్యాలి అన్న తపనతోనే వేల కోట్లు ఖమ్మంకు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు కావాల్సిన అన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించానన్నారు.

మా నాన్న గారి హయాం నుండి గెలిచినా.. ఓడినా పక్క దిక్కులు ఎప్పుడూ చూడలేదు.. ప్రజల కోసమే పనిచేస్తున్న. మా నాన్న గారు నాకు ఇచ్చిన అస్థి మీరంతా. ఇక్కడ ప్రజల అభివృద్ది, సంక్షేమం నా బాధ్యత గా భావిస్తున్నా కాబట్టే ఇన్ని కోట్ల నిధులు నిస్వార్థంగా తీసుకొచ్చా అన్నారు. అభివృద్ది విషయంలో ఒళ్ళు దాచుకోకుండా పని చేశానని, ప్రజలు కూడా ఇక్కడ జరిగిన అభివృద్ధిని గుర్తించాలన్నారు.

read also : 29న మంత్రివర్గ సమావేశం..?

బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి పువ్వాడ వ్యాఖ్యనించారు. ఎన్నికలు వచ్చినపుడు సహజంగా చాలా మంది వస్తారు.. స్వార్థంతో కూడిన ప్రేమ చూపిస్తారు.. కన్నీళ్లు పెట్టుకుంటారు. వాటికి కరగాల్సిన పని లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్దితో ఉందన్నారు.

Hospital

ఒకప్పుడు ప్రతి ఇంటికి ఇన్వెర్టర్లు ఉండేవి.. కానీ నేడు ఇప్పుడు ఉన్నాయా.. రైతులకు.. గృహాలకు 24 గంటలు విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మనది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి మనకు ఉన్నది 7,770మెగా వాట్స్ కరెంట్. కానీ నేడు 18వేల మెగా వాట్స్ లభ్యతలో ఉన్నది. అనతి కాలంలోనే ఇంతటి విజయం సాధించిన కేసీఆర్ కి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

కోవిడ్ సమయంలో రైతులు పండించిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆయా ధాన్యం తరలించడానికి లారీల కోసం తీవ్ర ఇబ్బందులు పడి ప్రతి గింజను తరలించామన్నారు. రైస్ మిల్లుల విషయంలో రాజేశ్వరరావు అందించిన సహకారంకు ధన్యవాదాలు తెలిపారు.

read also : బై..బై.. గణేశా..గణనాథునికి ఘన వీడ్కోలు..

కోవిడ్ సమయంలో ప్రజలను నా కుటుంబ సభ్యుల్లాగే దగ్గరుండి వారికి అన్ని విధాలుగా సహకారం అందించానని, ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వార్డ్ లో స్వయంగా వెళ్లి ప్రతి ఒక్కరిని పరామర్శించి వారికి కావాల్సిన అనేక సదుపాయాలు అందించాం అన్నారు. అవసరం అయిన రేమిడిసివర్ ఇంజెక్షన్లు తీవ్ర కొరత ఉన్న సమయంలో హెటిరో డ్రగ్స్ అధినేత, ఎంపి పార్థసారథి రెడ్డి ని ప్రత్యేకంగా కోరడంతో ఖమ్మంకు ప్రతి రోజూ రేమిడేసివర్ ఇంజెక్షన్స్ ను తెప్పించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వందల మందిని కాపాడుకున్నాం అని గుర్తు చేశారు.

పేషంట్స్ కు ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉండటంతో ITC వారికి వచ్చే ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ను ప్రత్యేకంగా టాంకర్ లు సమకూర్చి ప్రతి రోజూ 5టన్నుల ఆక్సిజన్ ను ఖమ్మంకు తెప్పించి అనేక మంది ప్రాణాలు కాపాడగలిగాం అప్పుడు ఎక్కడికి పోయారు వీళ్లంతా అని ప్రశ్నించారు. కనీసం కాకరకాయ అన్న పంచారా ఇప్పుడు వచ్చి అంత చేసినం.. ఇంత చేసినం.. అంటే అయిపొద్దా.. ఓట్ల కోసం ఆచరణ సాధ్యం కాని పథకాలు కాంగ్రెస్ చెప్తుంది.. అది అయ్యే పనేనా. కేసీఆర్ ఇచ్చిన దానికి డబుల్ ఇస్తాం అంటున్నారు.. కాంగ్రెస్ అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.

వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంను మళ్ళీ ఆదరించి హ్యాట్రిక్ విజయం అందించాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పునుకొల్లు నీరజ, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణా రావు, కార్పొరేటర్ లు కమర్తపు మురళీ, మందడపు లక్ష్మీ, మక్బూల్, కొప్పు నరేష్ కుమార్, మెంతుల శ్రీశైలం, బండారు శ్రీనివాస రావు, పిండిపోలు రాంమూర్తి, మన్నెం కృష్ణ, ఉగారు మాధవి, సుజాత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.