Read News in Telugu Language
adsdaksha

గ్రామ స్వరాజ్య కాంక్షకు అనుగుణంగా సీఎం కేసిఆర్ పాలన…

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 2

దేశ ప్రజల స్వేచ్ఛా వాయువుల కోసం గాంధీజీ ( gandhiji ) చేసిన అలుపెరగని పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar )  అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం మంత్రి పువ్వాడ ఖమ్మం నగరం త్రీ టౌన్ గాంధీ చౌక్ లోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అహింసా మార్గంలో దేన్నైనా జయించవచ్చు అని నిరూపించిన గాంధేయ మార్గంలోనే కేసిఆర్ తెలంగాణ ( telangana ) రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యకాంక్షకు అనుగుణంగా తెలంగాణలో కేసిఆర్ ( kcr ) పాలన సాగుతోందని, మహాత్ముడి ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పల్లెలను ఆర్దికంగా పరిపుష్టం చేస్తున్నారని అన్నారు. గాంధీజీ సేవలు సదా స్మరనీయమని మహాత్మునికి మంత్రి పువ్వాడ జోహార్లు అర్పించారు.

Hospital

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ పసుమర్తి రాం మోహన్, ఆర్డీఓ గణేష్, నాయకులు తోట రామారావు, కొత్త వెంకటేశ్వర్లు, షకీనా, గార్లపాటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.