Read News in Telugu Language
adsdaksha

పేదల పాలిట వరం గృహలక్ష్మి పథకం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 5

నియోజకవర్గ వ్యాప్తంగా మూడువేల మందికి  గృహలక్ష్మి పథకం.

పండుగ వాతావరణం లో మంజూరు పట్టాల పంపిణీ ..

గృహలక్ష్మి పథకం పేద, సామాన్య ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వరం అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. గృహలక్ష్మి ( gruhalakshmi )  పథకం మంజూరు పత్రాలను గురువారం ఖమ్మం ( khammam ) భక్తరామదాసు కళాక్షేత్రంలో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ పంపిణి చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలనెరవేర్చిన మహానుభావుడు, ఆత్మబంధువు మన సీఎం కేసీఆర్‌ ( cm kcr ) అన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి పథకం వర్తింప జేస్తామని పేర్కొన్నారు.

Hospital

ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహలక్ష్మి పథకమని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని తెలిపారు. తెలంగాణ ( telangana ) లో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శం గా ఉందని, బీఆర్ఎస్‌ ( brs ) మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. మళ్ళీ ఇలాంటి పథకాలు మనకు పూర్తి స్థాయిలో అందాలంటే బిఆర్ఎస్ ప్రభుత్వం ను గెలిపించుకోవాలని కోరారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, డెప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డెప్యూటీ మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి, కార్పొరేటర్ లు దాదే అమృతమ్మ సతీష్, పాకాలపాటి విజయ నిర్మల శేషగిరి రావు, , పగడాల శ్రీవిద్య నాగరాజు, శీలంశెట్టి రమా వీరభద్రం, మడురి ప్రసాద్, బుర్రి వెంకట్ కుమార్, మాటేటి అరుణ, పసుమర్తి రాం మోహన్, బుడిగం శ్రీను, మాజీ కార్పొరేటర్ కు తోట రామారావు, మాటేటి నాగేశ్వర రావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుర్రి వినయ్ కుమార్, కన్నం ప్రసన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.