Read News in Telugu Language
adsdaksha

పెద్ద పాలేరు ఇప్పుడు ఎవరికి పాలేరు..?

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 26

తుమ్మలను ఏకి పారేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

పాలేరు కు పెద్ద పాలేరు గా పని చేస్తా అన్న నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరు గా పని చేస్తున్నావని ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) తుమ్మల నుద్దేశించి ప్రశ్నించారు. గురువారం ఖమ్మం నగరంలోని 33వ డివిజన్ లో గీత వెంకన్న ( geetha venkanna ) అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాలేరు ( paleru ) లో పని చేస్తా అన్న వ్యక్తి ఖమ్మం ( khammam ) లో పోటీ చేస్తా అనడంతో మీకు నిలకడ లేదని అర్థమవుతుందన్నారు.

పాలేరు కు పెద్ద పాలేరు గా పని చేస్తా అన్న నువ్వు ఇప్పుడు ఎవరికి పాలేరు గా పని చేస్తున్నావని పువ్వాడ ప్రశ్నించారు. కేసీఆర్ కానీ, నేను కానీ అసమర్ధులకు పదవులు ఇచ్చామని చెప్తున్నారు. బిసి లకు పదవులు ఇవ్వడం అంటే మీ దృష్టిలో వారు ఆసమర్థులా..? బిసి లకు ఇస్తే ఆసమర్ధులు.. ఓసి లకు ఇస్తే సమర్ధులా అని ప్రశ్నించారు. అలాంటి వివక్ష మీకెందుకుంది.. కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అన్నారు. ప్రజా స్వామ్యం లో అందరికీ పాలించే హక్కు ఉందని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

read also : బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Hospital

మీ పక్కన ఉన్న వాళ్లంతా పాటు గాళ్ళా..? డీసీసీబీ బ్యాంక్ ను నిండా ముంచిన వ్యక్తులు మీ పక్కన లేరా, అక్రమార్జులు, రౌడీ షీటర్ లు కాదా మీ పక్కన ఉన్న వాళ్లంతా.. మీలాంటి అహంకారం ఉన్న వాళ్ళను ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదించరు. ఖమ్మం ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటారు తప్ప అహంకారం కాదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు.

మీ అహంకారంతో కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ని ఎలాంటి పదజాలంతో తిట్టావో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోందని మంత్రి పువ్వాడ ధ్వజమెత్తారు. అది విన్న ప్రజలు అయ్యా తుమ్మల ఏంటయ్యా ఆ బాషా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించారు. దళిత మహిళా, బిసి ప్రజాప్రతినిధులను మీరు పిలిచే విధానం ఎవరికి తెలియదు ఖమ్మంలో, మీరంటే ప్రజలు చిత్కరించుకునే కదా ఇక్కడ నుండి నిన్ను తరిమేశారు. పాలేరులో కూడా ఇదే ధోరణి కొనసాగించారు. అక్కడ ప్రజలు కూడా నిర్మొహమాటంగా తరిమేశారు. ఇంకా సిగ్గులేకుండా మళ్ళీ ఇదే ఖమ్మం ప్రజల మధ్యకు వస్తున్నావు అని ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరం మాకు ఓన్లీ ఆప్షన్ కానీ మీకు ఆప్షన్. ఎక్కడ సీటు ఖాళీ ఉంటే అక్కడికి వెళ్తారు.. ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన అని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. ప్రజలకు ఇంటింటికీ త్రాగు నీరు ఇచ్చింది నువ్వా… ? బిఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ రూ.350 కోట్లతో త్రాగునీరు ఇచ్చిందని గుర్తు చేశారు. నీ ఇంట్లో నుండి, నువ్వు ఉన్న పార్టీ నుండి నీళ్ళు ఇవ్వలేదు.. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. ప్రజా ధనం తో ప్రజల కోసం మంజూరు చేసిన పథకం మిషన్ భగీరథ.. మీ వల్ల వచ్చింది కాదు అని మీరు తెలుసుకుంటే బావుంటుందన్నారు. ఇక్కడి నుండి మార్కెట్ ను తరలించాలి అని ప్రయత్నాలు చేయలేదా …? ఇక్కడ కార్మికులు, కర్షకులు, కూలిలను నట్టేట ముంచాలని ప్రయత్నాలు చేసింది నువ్వు కాదా.. ఆ నింద నా మీద వేసి చేతులు దుకుపుకోవాలని చూశారు.. నేను ఆ నాడు ఎమ్మేల్యే గా ఉన్న.. అప్పుడే స్పష్టం చేశాను.. నా బొందులో ప్రాణం ఉండగా మార్కెట్ ను ఇక్కడి నుండి పోనివ్వను అని ఆనాడే స్పష్టం చేశానని పేర్కొన్నారు.

read also : పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నా.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి..!

గీత వెంకన్న మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలో ఎన్నడూ లేని అభివృది నేడు పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో జరిగిందన్నారు. ఇక్కడి నుండి మార్కెట్ ను తరలించాలని కొందరు తీవ్ర ప్రయత్నం చేశారు.. కానీ ఆ ప్రయత్నాలను తిప్పికొట్టిన వ్యక్తి పువ్వాడ అజయ్ అని అన్నారు. వ్యవసాయ మార్కెట్ ను ఇక్కడి నుండి తరలించడం ద్వారా ఇక్కడ ఖమ్మం ఎమ్మేల్యే గా ఉన్న అజయ్ కుమార్ ను బద్నాం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. మార్కెట్ ను పాలేరు కు తరలించాలని నాడు తుమ్మల నాగేశ్వర రావు, విశ్వప్రయత్నం చేశారని చెప్పారు. దాన్ని అడ్డుకుని మన మార్కెట్ ఇక్కడే ఉండే విధంగా వారు చేసిన ప్రయత్నం మార్చిపోకూడదు అని అన్నారు.

ఖమ్మం త్రీ టౌన్ లో నివాసం ఉంటున్న ప్రజలు నేడు చాలా సంతోషంగా ఉన్నారని గీత వెంకన్న అన్నారు. ఒకప్పుడు ఇక్కడ ఉండటానికి ప్రజలు జంకే వారు.. కానీ నేడు ఇక్కడే ఉండాలని ఆసక్తి చూపుతున్నారని, ఇదంత ఇక్కడ జరిగిన అభివృద్దే వల్లే అన్నారు. గీత వెంకన్న అధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శి చిన్నికృష్ణ రావు, మెంతుల శ్రీశైలం, మలిశెట్టి వెంకటేశ్వర్లు, పారా నాగేశ్వర రావు, సోమ నరేష్, వేములపల్లి వెంకన్న, మన్నెం కృష్ణ, నున్నా మాధవ రావు, కార్పొరేటర్ తోట ఉమా వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.