Read News in Telugu Language
adsdaksha

జిల్లాకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ దే..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 2

గత 75 సంవత్సరాలలో ఖమ్మం  ( khammam ) నియోజకవర్గానికి మంత్రి పదవి ఇచ్చిన ఘనత సీఎం కెసిఆర్ ( cm kcr ) కే దక్కుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada Ajay kumar ) అన్నారు. గురువారం ఖమ్మం బీఆర్ఎస్ ( brs ) పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసిఆర్ తొలి విడత ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో మొదటి సభ పాలేరులో జరిగిందన్నారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన 3 సభలు విజయవంతం అయ్యాయని పేర్కొన్నారు.

ప్రజా ఆశీర్వాద సభలతో ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నాడి తెలుస్తోందన్నారు. కేసిఆర్ సభా ప్రాంగణం నుండి అడిగిన ప్రతి ప్రశ్నకు అనూహ్య స్పందన లభించిందన్నారు. కేసిఆర్ మీద ప్రేమ ప్రజల్లో ఆవగింజంతైనా తగ్గలేదన్నారు.

ఆయన సభకు ప్రజలు స్టేడియంలో ఎంత మంది ఉన్నారో, సభా ప్రాంగణం బయట కూడా అంతే మంది ఉన్నారన్నారు. 5వ తేదీన ఆదివారం sr & bgnr కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభ జరుగుతుందని తెలిపారు. ఆ రోజు రెండు సభలు ఉన్నాయని ఒకటి ఖమ్మం, రెండవ ది కొత్తగూడెం లో జరగనుందని తెలిపారు.

Read also : రైతుల బాధలు నాకు తెలుసు నేనూ కాపోన్నే… ఎన్నికల్లో ప్రజలే గెలవాలె..

ఈ సభను విజయవంతం చేయాలని పువ్వాడ పిలుపునిచ్చారు. నా విజయంతో పాటు, ఖమ్మం జిల్లాలో ఉన్న 10 మంది అభ్యర్థుల విజయాలను కాంక్షిస్తూ సభా ఏర్పాటు జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ సభ విజయవంతానికి పోలిస్ వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఖమ్మంకు మెడికల్ కళాశాల పెట్టాలని 75 సంవత్సరాలలో ఏ పార్టీకి ఆలోచన రాకపోవడం దురదృష్టకరమని మంత్రి పువ్వాడ వ్యాఖ్యానించారు. నేను భూమి పుత్రుడిని కాబట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలనిపిస్తోంది.
ప్రత్యర్థి అభ్యర్థి అంటున్నాడు.. ఆయన హయాంలో ఖమ్మంలో వాటర్ ట్యాంకర్ లు తిరిగేవని. అవును ఆ సమయంలో నా అక్క, చెల్లెళ్ళు నీటి కోసం ఎంత అవస్థ పడ్డారో మీ మాటల్లోనే తెలుస్తుందన్నారు.

Hospital

ఖమ్మం జిల్లాలో ఏర్పడిన ఏకైక మండలం రఘునాథపాలెం మాత్రమే. రూ.253 కోట్ల రూపాయలు కేవలం రఘునాథపాలేం మండలానికి కేటాయించాం అని తెలిపారు.

Read also : దళితబంధు పెట్టమని మమ్మల్ని ఎవ్వరూ అడగలే.. దళిత సమస్యలు దేశానికే మాయని మచ్చ..

నోటిఫికేషన్ రాకుండానే పొట్టల్లో కత్తులు దింపుతున్నారు. పేగులు తెగేలా కత్తులు దింపుతున్నారు మీ కార్యకర్తలు ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. మరొకసారి నాకు అవకాశం ఇస్తే రెండు, మూడు ఇంతలు అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు.

సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంద్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ, నిన్న సత్తుపల్లి సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

దేవుడి దయ వల్ల సభకు సంబందించి ఏ ఒక్క ఘటన జరగకపోవడం అదృష్టం అన్నారు.
సభ సత్తుపల్లి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని
ఆ ఉత్సాహంతో ఎన్నికల్లో గెలుపొంది తీరుతాం అన్నారు.

ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, నిన్న జరిగిన సత్తుపల్లి, ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం అయ్యాయన్నారు. 5వ తేదీన ఖమ్మం SR & BGNR గ్రౌండ్ లో జరగనున్న ప్రజా ఆశీర్వాద సభ ను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఇల్లందులో గతంలో చిన్న చిన్న సభలు జరిగి ఉంటాయి కానీ అతి పెద్ద సభ జరిగి, విజయవంతం అవ్వడం ఇదే ప్రథమం అన్నారు.

నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి పువ్వాడ అజయ్ కుమార్ ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.