Read News in Telugu Language
adsdaksha

పెద్దాయన మతి బ్రమించినట్లు మాట్లాడుతున్నారు… ప్రజల్ని మభ్యపెట్టి గెలవాలనుకోవడం సబబు కాదు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 4

సీఎం సభకోసం కట్టడాలు తొలగిస్తున్నారంటుంన్నారు.. సభావేదికకు అడ్డుగా ఉందనే తొలగించాం..

కట్టాడాలు కూల్చిన చరిత్ర కాంగ్రెస్ ( congress ) దే అని మంత్రి ఖమ్మం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఆదివారం ఖమ్మం ( khammam ) లో సీఎం ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్న సందర్భంగా శనివారం సభాప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖమ్మానికి అమిత్ షా లాంటి వారు వస్తేనే పటేల్ స్టేడియం గ్రౌండ్ లో సభ నిర్వహిస్తారని అన్నారు. ఎస్ఆర్ బిజిఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ లోనే బిఆర్ఎస్ సభ నిర్వహించబోతున్నామంటే మాధైర్యం ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు. కొందరు ఇక్కడ వాకర్స్ కి సంబంధించిన వేదికను సీఎం సభ కోసం కూల్చివేశారని విమర్శిస్తున్నారని తెలిపారు.

వాకర్స్ విన్నపం తో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వాకర్స్ కోసం ఇక్కడ చిన్న వేదికను నిర్మించి ఇచ్చారని, సీఎం సభ సందర్భంగా భద్రతారీత్యా, సభావేదిక నిర్మాణం దృష్ట్యా ఆవేదిక తీసివేయడం జరిగిందన్నారు. సభ అనంతరం తిరిగి నిర్మిస్తామని తెలిపారు. ఏ గుడినో మసీదునో చర్చినో కూల్చివేసినట్లు కొందరు ఆరోపణలు చేస్తున్నారని, అసలు కాంగ్రెస్ హయాంలోనే కూల్చివేతలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బాబ్రిమసీదు తో మొదలైన కూల్చివేతలు, ఒరిస్సాలో చర్చిలు కూలగొట్టడం నుండి ఎన్నో దాష్టికాలు జరిగాయన్నారు. ప్రజల్ని మాటలతో మభ్యపెట్టి గెలవాలనుకోవడం మూర్ఖత్వమని పువ్వాడ అన్నారు. పెద్దాయన మతి బ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

Hospital

read also : జిల్లాకు మంత్రి పదవి ఇచ్చిన ఘనత కేసీఆర్ దే..

ఇక్కడ నన్నుకొందరు సైకో అంటుంన్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కానీ అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేసే పిచ్చోళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారని వాళ్ళకోసం ఇక్కడ పిచ్చాసుపత్రి కట్టించాల్నిన అవసరం ఉందన్నారు. ఆదివారం జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు ప్రజలు కార్యకర్తలు అధికసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.

అన్నివిధాల అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదం అని ఎంపీ నామానాగేశ్వరరావు అన్నారు. రాహుల్ గాంధి తెలంగాణలో సభలు పెట్టి తమ హామీల గురించి మాట్లాడతారు తప్ప తెలంగాణ రాష్ట్రం గురించి, ప్రజల గురించి, ఫండ్స్ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ, మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీ మారుతున్నారంటూ జరిగే ప్రచారాన్ని ఖండించారు. తమకు పార్టీ మారాల్సిన ఆగత్యంలేదని, ఖమ్మం నగరాన్ని మంత్రి పువ్వాడ అజయ్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. మరో సారి తమ గురించి అసత్యాలు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఎన్నికల కమీషన్ కు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఆర్జేసీ కృష్ణ, మార్కట్ కమిటీ చైర్మన్ శ్వేత, కర్నాటి కృష్ణ, నాగరాజు, పార్టీ జిల్లా అద్యక్షులు తాతా మధుసూధన్ రావు, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా   చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.