Read News in Telugu Language
adsdaksha

అది నేనే.. : పువ్వాడ అజయ్ కుమార్

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 8

మీ ముందు తరానికి బాటలు వేసే వాడిని నేనే అని వ్యాఖ్య..

యువతకు ఉద్యోగ కల్పన.., ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యత నాదే..

ఎస్బీఐటీ కళాశాల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ..

ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లా యువతకు, భవిష్యత్ తరాలకు బాటలు వేసేది నేనే.. బాధ్యత నాదే అని ఖమ్మం బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఎస్బీఐటీ ( sbit ) ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ఆర్జేసి కృష్ణ ( rjc krishna )  అధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వారి కోసమే ప్రత్యేకంగా కేసీఆర్ సహకారంతో ఐటి హబ్ స్థాపించి నేడు వందల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.

ఇక్కడ యువతకు ఐటి రంగంలో ఉద్యోగాలు రావాలని ఇక్కడ ఐటీ హబ్ నిర్మించి అందులో దాదాపు 20 కంపెనీలను ఒప్పించి, మెప్పించి తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల అధ్వర్యంలో వివిధ కంపెనీలను ఖమ్మం తీసుకొచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కల్పించి వేల మంది విద్యార్థులకు ఇంజనీరింగ్ అవగానే ఉద్యోగాలు కల్పించడం జరిగిందని పువ్వాడ తెలిపారు.

Hospital

read also : యూనిట్ ఆఫ్ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ సేవలు చిరస్మరణీయం..

తెలంగాణ రాష్ట్రంలో 2014 సంవత్సరం నాటికి మన ఐటి ఎగుమతులు 57 వేల కోట్లు కాగా నేడు.. 2.40 లక్షల కోట్ల ఎగుమతుల స్థాయికి మనం చేరుకున్నామని ఇదంత ఐటి శాఖ మంత్రి కేటిఆర్ విజన్ తోనే సాధ్యమైందన్నారు. ఐటి రంగంలో నేడు మన రాష్ట్రం బెంగళూరు ను కూడా దాటి పోతున్నదంటే మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా యువతకు హైద్రాబాద్, బెంగళూరు స్థాయికి ఐటి ఉద్యోగాలు ఇక్కడ పొందాలని నేను ఎమ్మేల్యేగా ఎన్నికైన నాడే సంకల్పించానని మంత్రి పేర్కొన్నారు. మీకు, మీ తరువాత తరానికి మంచి ఖమ్మం ఇవ్వాలనే మంచి ఆలోచనతో, తపనతో శక్తి యుక్తి ఉన్న వాడిని మీరు ఎన్నుకోవాలని కోరారు.

మనకు, మన భవిష్యత్ తరాలకు మంచి పాలన, మంచి ఖమ్మంను చూడాలంటే, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.