Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం ఖిల్లా కూడా నేనే కట్టిన అని చెప్తాడెమో..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 10

ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ..

ఖమ్మంలో ఒక పెద్ద మనిషి ఇక్కడ జరిగిన అభివృద్ది మొత్తం నేనే చేసానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.. ఇంకా ఏం చెప్తాడో.. ఖమ్మం ఖిల్లా కూడా నేనే కట్టించిన అని చెప్తాడెమో అని ఖమ్మం బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఖమ్మం ( khammam ) నగరంలోని 19వ డివిజన్ సంభాని నగర్, రఘునాధపాలెం మండలం వివి పాలెం గ్రామంలో శుక్రవారం పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా  పువ్వాడ మాట్లాడుతూ, ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వం లో నేను ఖమ్మం ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండగా ఓ పెద్దమనిషి ఇదంతా నేనే అభివృద్ది చేసానని మాట్లాడటం చూస్తే అతనికి మతి బ్రమించిందేమో అన్న అనుమానం కలుగుతుందన్నారు.

read also : రేవంత్ రెడ్డికి బిగ్ షాక్..

ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం ను అభివృద్ది చేసుకున్నాం.. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన కాబట్టి నాకున్న కసి, నాకున్న తపన వేరే వారికి ఉండదన్నారు. ఖమ్మం నియోజకవర్గం బావుండాలి.. అభివృద్ది చెందాలి అని నిత్యం తపించి ఆ కల సాకారం చేశా అన్నారు. ఖమ్మం నగరం తో పాటు రఘునాధంపాలెం మండలం కూడా బాగుండాలి అనుకున్న కాబట్టే ఇంత అభివృద్ది చేసి మీ ముందు నిలిపా అని తెలిపారు.

Hospital

ఖమ్మం నగరం.. రఘునాధపాలెం మండలం నాకు రెండు కళ్ళ లాంటివని పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు. నగరానికి ఆనుకుని ఉన్న వివి.పాలెం గ్రామం నేడు ఏ విధంగా ఉందో మీకు తెలుసు అని, మీ స్వీయ అనుభవంలోనే ఉందన్నారు.

ఇక్కడ ఒకాయన చెప్తా ఉన్నాడు.. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రి గా ఉంటే, వేల కొట్లు నేను తీసుకొచ్చా అని నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు. ప్రజలు ఆలోచన చేయాలి.. నేను ప్రభుత్వం లో ఉంటే అతను ఎలా నిధులు తీసుకురాగలడు. కనీసం సర్పంచ్ కూడా కాదు కదా.. మరి నువ్వెలా చేశావయ్యా నిధులు ఢిల్లీ నుండి తీసుకొచ్చావా అని ప్రశ్నించారు.

read also : అరటిపండును పూర్ణఫలం అంటారు ఎందుకు……!!

నువ్వు ఖమ్మం లో 2009 నుండి 2014 వరకు ఎమ్మేల్యే గా పని చేసావు కదా అప్పుడు ఉన్నాయా ఇవన్ని.. రోడ్లు, సెంట్రల్ డివైడర్ లు, లకారం పార్క్, ఐటీ హబ్, గోల్లపాడు ఛానల్ అభివృద్ది, పార్కులు, ఓపెన్ జిమ్ లు, ఇండోర్ స్టేడియం లు, ఆర్ఓబి బ్రిడ్జి, పోలీస్ కమిషనరేట్, బస్ స్టాండ్, ఎన్ ఎస్ పి వాక్ -వే లు, సుడా పార్క్, ఇవన్నీ ఉన్నాయా నువ్వు ఉన్నపుడు.. రాత్రికి రాత్రి అద్భుతాలు సృష్టించావా.. చెప్పాలన్నారు.

నీది కేవలం పదవి వ్యామోహం, పదవి కాంక్ష మత్రేమే అని పువ్వాడ తుమ్మలను ఉద్దేశించి అన్నారు. పైకి మాత్రం నాకు ఈ పదవులు అవసరం లేదు ప్రజల కోసమే అని భుకాయించడం దేనికి అన్నారు. ప్రజలను మభ్య పెడుతూ, మోసం చేయడం నీకే సాధ్యమని అభివృద్ది నేనే చేసా. నిధులు నేనే తెచ్చా అని సిగ్గులేకుండా ఎలా చెప్పగలుగుతున్నరో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.

Leave A Reply

Your email address will not be published.