Read News in Telugu Language
adsdaksha

తుమ్మల ఓల్డ్ ఐఫోన్-5.. నేను లేటెస్ట్ ఐఫోన్..15

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 12

డాలర్ ఖమ్మం కూరగాయల మార్కెట్ లో చెల్లదు..

నేను అప్ డేటెడ్.. అతను ఔట్‌డేటెడ్..

కాంగ్రెస్ ( congress ) అభ్యర్థి తుమ్మల ( tummala ) ఓల్డ్ ఐఫోన్-5 లాంటి వెర్షన్.. నేను లేటెస్ట్ ఐఫోన్ 15 లా పని చేస్తున్నానన్ని బిఆర్ఎస్ ( brs ) ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. ఆదివారం ఖమ్మం ( khammam ) నగరం లోని 50వ డివిజన్ లో అమెరికన్ బయోకేర్ ఏరియా సేల్స్ మేనేజర్ నార్నే వెంకట ప్రసాద్ ( narne venkata prasad ) అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడ ప్రజల అవసరాలు గుర్తించి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల నుండి ఆదరణ వస్తుందన్నారు. ఏ నాయకుడైనా ప్రజల మధ్య ఉండి, ప్రజల అభిమానం పొందిన వాడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఔట్‌డేటెడ్.. నేను లేటెస్ట్. అందుకే ప్రజలు నన్ను రెండు సార్లు ఆదరించారని ఈసారి కూడా అదే ఆదరణ చూపాలని పువ్వాడ విజ్ఞప్తి చేశారు. నన్ను చెల్లని నోటు అన్నాడు.. అతను యుఎస్ డాలర్ ను అంటున్నాడు.. ఖమ్మం మార్కెట్ లో డాలర్ ఇస్తే చెల్లుతుందా..? డాలర్ లు ఇక్కడ దుకాణంలో, కూరగాయల మార్కెట్ లో తీసుకుంటారా.. చెల్లదు అని వెనక్కి పంపిస్తారు.. అదే కదా నేను చెప్పింది కూడా . నువ్వు ఖమ్మం లో చెల్లవు.. నువు ఉండేది.. ఉండాల్సింది విదేశాల్లో తనకు తానే లోకల్ కాదు అని నిరూపించు కున్నాడు అని ఎద్దేవా చేశారు. నేను ఎమ్మేల్యే గా అయిన నాడు ఖమ్మం లో కనీస సదుపాయాలు లేని దుస్థితి.. నుండి నేడు నందనవనమైన ఖమ్మం ను ఆవిష్కరించడం జరిగిందన్నారు.

read also : దీపావళి లక్ష్మీ పూజా విధానం, వ్రత నియమాలు ..

ఖమ్మం అభివృద్ధికి కావలసిన నిధులు ఇన్ని వేల కోట్ల ఇచ్చింది కేసీఆర్, కేటిఆర్ అని మంత్రి చెప్పారు. అందుకే ఇంత అభివృద్ది చేయగలిగాం అన్నారు. ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని వివరించారు. ఇక్కడ ఇంకా చాలా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని, రింగ్ రోడ్, ఫ్లైఓవర్ బ్రిడ్జి లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లు రావాల్సి ఉందని, అవన్నీ ఖమ్మం కు రావాలి అంటే మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Hospital

నాకు లాస్ట్ సారి పదవి ఇవ్వాలి అని తుమ్మల అడుగుతున్నాడు.. పని చేయడానికి నాకు పదవి కావాలి అని నేను అడుగుతున్న.. పని చేసే వాడికే ప్రజలు పదవి ఇస్తారన్నారు. దుర్భరమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ చేసిన అభివృద్ది అంత నేనే చేశాను అని తుమ్మల చెప్పడం విచారకరం అని, ప్రజల అన్ని తెలుసన్నారు.

read also : ఖమ్మం ఖిల్లా కూడా నేనే కట్టిన అని చెప్తాడెమో..

నేను లోకల్.. ఎప్పుడూ ఇక్కడే ఉంటా అని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇక్కడే మాంట్‌ఫోర్ట్ స్కూల్ లో చదువుకున్న.. ఎఎస్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్, ఎస్ఆర్ బిజిఎన్ ఆర్ కళాశాలలో లో డిగ్రీ చదివిన.. అతను ఏక్కడ ఉంటాడు.. రాత్రి అయితే గండుగులపల్లి పోతాడు.. నేను మమతలో నా ఇంటికి పోతా.. ఎవరు ఇక్కడ ఉండే వారో వాళ్ళకి మీ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచన చేసి అభివృద్ది వైపు నిలవాలని కోరారు.

నార్నె వెంకట ప్రసాద్ మాట్లాడుతూ, ఖమ్మంను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు నడుం బిగించిన బిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ను గెలిపించేందుకు తమ శాయాశక్తులా కృషి చేస్తామన్నారు. డివిజన్ వాసులు కూడా గతంలో మన డివిజన్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించి అభివృద్ధికి పట్టం కట్టే అజయ్ కుమార్ ను అత్యధిక మెజరిటీ తో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, విజయ్, సందీప్, రామయ్య, భద్రం, సత్యనారాయణ, శ్రీను, కుచుపుడి రమేష్ లక్ష్మీ, సర్పంచ్ యండపల్లి రాధిక, సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

కార్పొరేటర్ రాపర్తి శరత్ కుమార్ అధ్యక్షతన జరిగిన మరో సమావేశంలో డివిజన్ అద్యక్ష, కార్యదర్శి పాల నాగేశ్వరరావు, మల్లికార్జున్, దొరేపల్లి రవికుమార్, పొన్నం వెంకటేశ్వర్లు, శీలంశెట్టి వీరభద్రం, పి రేణుక, లింగనబోయిన సతీష్, కోడరెక్క ఉమాశంకర్, గోరంట్ల వెంకటేశ్వర్లు, వేముల రవి కుమార్, బాబురావు, రంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.