Read News in Telugu Language
adsdaksha

నా నామినేషన్ రిజెక్ట్ చేయించాలని చాలా కష్టపడుతున్నారు…

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 13

ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది : పువ్వాడ

ఖమ్మంలో నేను చేసిన అభివృద్ది చూసి ఓర్వలేక ఓటమి భయంతో ఖమ్మం (khammam ) కాంగ్రెస్ ( congress ) అభ్యర్థి నా నామినేషన్ ను తిరస్కరించాలని ప్రెస్ మీట్ పెట్టీ మరి పోరాడుతున్నాడని ఖమ్మం బిఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar ) అన్నారు. నాపై ధర్మ పోరాటం చేయాల్సిన వ్యక్తి వెన్నుపోటు పొడవాలని చూసున్నాడని ద్వజమెత్తారు.

Hospital

read also : తుమ్మల ఓల్డ్ ఐఫోన్-5.. నేను లేటెస్ట్ ఐఫోన్..15

సోమవారం ఖమ్మం నగరం లోని10వ డివిజన్ లో పువ్వాడ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడచిన 40ఏళ్ళలో ఆయన చేసిన నీచమైన రాజకీయాలు ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారని దమ్ముంటే ధర్మ పోరాటం చేయాలని హితువుపలికారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని మోసాలు చేసిన చివరికి ధర్మమే గెలుస్తుందని పువ్వాడ అజయ్ అన్నారు. నేనెప్పుడూ ధర్మం వైపే నిలబడతానని, ధర్మమే నన్ను గెలుపిస్తుందన్నారు.

నేను ఇక్కడ చేసిన మంచి ప్రతి ఒక్కరికీ చెప్పి ఓట్లు అడుగుతుంటే కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం నన్ను, నా నామినేషన్ ను రిజెక్ట్ చేయాలని చాలా కష్టపడుతున్నాడన్నారు. ఇక్కడ అభివృద్ది చేసింది ఎవరు.. చేసేది ఎవరో ప్రజలకు బాగా తెలుసు.. వాళ్లకు నాకు ఉన్న అభిమానమే నన్ను విజయ తీరాలకు చేర్చుతుందని పేర్కొన్నారు. అది చూసి తట్టుకోలేకే ఇలాంటి గోబెల్స్ ప్రచారం చేసి గెలవాలని అని చూస్తున్నారని విమర్శించారు. ఖమ్మం ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదించి కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.