Read News in Telugu Language
adsdaksha

ఇక హైద‌రాబాద్ లో క్వాంట‌మ్ సేవ‌లు ..

దక్ష న్యూస్, హైద‌రాబాద్‌: సెప్టెంబ‌ర్ 13

ఆర్టిఫీషియ‌ల్ ఇంజ‌లీజెన్స్‌, కొత్త సాంకేతిక‌ ఆవిష్కరణల నేప‌థ్యంలో మాన‌సిక ఒత్తిడిల‌ను త‌ట్టుకోవ‌డానికి, న‌యం చేసుకోవ‌డానికి క్వాంట‌మ్ ఉత్ప‌త్తుల‌ (quantum productions ) అవ‌స‌రం ఎంతో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ( errabelli dayakar rao ) అన్నారు. ఈ సేవ‌లు దేశంలో మొట్ట మొద‌టి సారిగా హైద‌రాబాద్ లో ల‌భించ‌డం కూడా సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఆయ‌న అన్నారు.

read also : మధుర మీనాక్షి అమ్మవారి పాదుకల వెనుక వాస్తవ గాధ..

Hospital

క్వాంటమ్ హెడ్ క్వార్ట‌ర్ అమెరికా న్యూ జెర్సీ (america new jersey ) లో ఉంద‌ని, ప్ర‌పంచ స్థాయి స‌దుపాయాల‌న్నీ ఇక్క‌డ ల‌భించ‌నున్నాయ‌ని మంత్రి తెలిపారు. ఈ సేవ‌ల‌ను ప్ర‌జ‌లు సద్వినియోగం చేసుకోవాల‌ని ఆయ‌న కోరారు. క్వాంట‌మ్ సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చిన నిర్వాహ‌కుల‌ను మంత్రి అభినందించారు. క్వాంట‌మ్ సేవ‌ల‌ను మంత్రి బుధ‌వారం మాదాపూర్ లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రితోపాటు రాజ్య‌స‌భ స‌భ్యులు ఒద్దిరాజు ర‌విచంద్ర‌, సినీ నిర్మాత దిల్ రాజు, నిర్వాహ‌కులు పాల్గొన్నారు.

read also : అంగన్వాడి టీచర్లకు హెల్పర్లకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

 

Leave A Reply

Your email address will not be published.