Read News in Telugu Language
adsdaksha

25 మందితో బీఎస్పీ మూడో జాబితా..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 5

అభ్యర్థుల పేర్లు ప్రకటించిన ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్..

31 స్థానాలు పెండింగ్..

తెలంగాణ ( telangana ) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 25 మందితో బీఎస్పీ( bsp )  మూడవ జాబితా ప్రకటించింది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ( r.s. praveenkumar ) జాబీతా విడుదల చేశారు. అయితే.. ఈ జాబితాతో మొత్తం 88 మందిని ఖరారు చేసినట్టయింది. ఇంకా 31 నియోజకవర్గాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతేకాకుండా.. ఈ జాబితాలో.. బీఎస్పీ నాయకత్వం రెండు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. రాజేంద్రనగర్‌ నుంచి మొదట ప్రొ.అన్వర్ ఖాన్‌ పేరు ఖరారు చేయగా, ఇప్పుడు ఆయనను అంబర్ పేట్‌కు మార్చారు. ఇక రాజేంద్ర నగర్‌ స్థానాన్ని రాచమల్లు జయసింహకు కేటాయించారు.

Hospital

read also : సొంత పార్టీలకు జెలక్ ఇస్తున్నట్లు చేస్తున్న సరదా రాయుళ్లు ..

థర్డ్ లిస్ట్ ఇదే..

మహేశ్వరం స్థానాన్ని కొత్త మనోహర్ రెడ్డికి, చెన్నూర్ (ఎస్సీ)లో దాసారపు శ్రీనివాస్ కు, ఆదిలాబాద్ టికెట్ ఉయక ఇందిరకు, ఆర్మూర్ లో గండికోట రాజన్న, నిజామాబాద్ (రూరల్) నుంచి మటమాల శేఖర్, బాల్కొండ టికెట్ పల్లికొండ నర్సయ్యకు, కరీంనగర్ లో నల్లాల శ్రీనివాస్ కు, హుస్నాబాద్ లో పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్ లో కుతాడి నర్సింహులు, సంగారెడ్డి టికెట్ పల్పనూరి శేఖర్ కు, మేడ్చల్ నుంచి మల్లేపోగు విజయరాజు, కుత్బుల్లాపూర్ టికెట్ ను మహ్మద్ లమ్రా అహ్మద్ కు, ఎల్.బి. నగర్ గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్ కు, కార్వాన్ టికెట్ ఆలేపు అంజయ్యకు కేటాయించారు.

గోషా మహల్ మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్ కు, నారాయణ్ పేట్ లో శ్రీనివాస్ ను, జడ్చర్ల శివ, అలంపూర్ (ఎస్సీ) చెన్న కేశవరావు, పరకాల నుంచి నరేష్ గౌడ్, భూపాలపల్లిలో గజ్జి జితేందర్ యాదవ్ ను, ఖమ్మంలో ఎ.శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి (ఎస్సీ) సీలం వెంకటేశ్వర రావుకు, నారాయణ్ ఖేడ్ స్థానాన్ని మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ లకు కేటాయించారు.

Leave A Reply

Your email address will not be published.