Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ సర్కార్ లోనే రఘునాధపాలెం సమగ్రాభివృద్ధి..

దక్ష న్యూస్, ఖమ్మం: సెప్టెంబర్ 26

తెలంగాణ సర్కార్ లోనే రఘునాథపాలెం ( raghunadapalem ) మండలం సమగ్రాభివృద్ధిని సాదించిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( puvvada ajay kumar )  పేర్కొన్నారు. మరో అవకాశం ఇస్తే సమస్యల్లేని మండలంగా తయారు చేస్తానన్నారు. మంగళవారం శివాయిగూడెం ( shivayigudem ) లో గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్, సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు. గత పాలకుల హయాంలో గ్రామాల అభివృద్దికి రూ.10 లక్షలు కూడా నిధులు వచ్చేవి కాదన్నారు. కానీ ప్రత్యేక తెలంగాణ ( telangana ) ఏర్పాటు తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) ప్రతి గ్రామానికి రూ. కోట్ల నిధులు వెచ్చిస్తున్నారన్నారు.

read alsso : పీవీ మార్గ్ లో లేక్ ఫ్రంట్ పార్క్ ..

శివాయిగూడెం చిన్న గ్రామ పంచాయితీ ఐనప్పటికీ నాలుగేళ్లలోనే రెండు కోట్ల పైచిలుకు పలు అభివృద్ధి పనుల నిమిత్తం కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అంతేకాక పల్లెల్లో పట్టణాలకు ధీటుగా సౌకర్యాలను సమకూర్చడమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. గతంలో గ్రామాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో, పోతో మళ్లీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ సర్కార్లో పునావృతం కాకూదనే ఉద్దేశంతో అవసరమైన చోట సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు.

read also : దసరా నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం..

Hospital

గ్రామాల్లో కోతల్లేని విద్యుత్ను అందించడంతో పాటు మిరుమిట్లు గొలిపే కాంతిని అందిచాలని గ్రామగ్రామాన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతేకాక పల్లెల్లో పారిశుద్య సమస్య, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచడం, రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు.

read also : పంట రుణ మాఫీ వారం రోజుల్లో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జెడ్సీ సిఈవో వీవీ అప్పారావు, జెడ్పీటీసీ మాళోతు ప్రియాంక, పీఆర్ ఇఇ కేవీకే శ్రీనివాస్, తహసీల్దార్ థామస్ విల్సన్, ఎంపీడీవో రామకృష్ణ, శివాయిగూడెం సర్పంచ్ చెరుకూరి ప్రదీప్, పువ్వాడ నగర్ సర్పంచ్ కాంపాటి లలిత, మాజీ జెడ్పీటీసీ కుర్రా భాస్కర్, వైస్ ఎంపీపీ గుత్తా రవి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అజ్మీరా వీరూనాయక్, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు లాల్సింగ్, నందా, కాంపాటి రవి, సాధిక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

read alsso : దసరా నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం..

Leave A Reply

Your email address will not be published.