Read News in Telugu Language
adsdaksha

మీరే కాదు.. మీ నాయన, తాతా ఉన్నా ఇలాగే చేర్చుకుంటాం..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 17

రేపటి నుండే కాంగ్రెస్ బస్సు యాత్ర..

ప్రారంభించనున్న రాహుల్ గాంధీ.. ప్రియాంక..

ఎన్నికల ప్రచారంలో గడప గడపకి పొంగులేటి..

రాబోవు ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం తర్వాత వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని మాజీ ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) అన్నారు. మంగళవారం కాంగ్రెస్ ( congress ) పార్టీ నాయకులు రాయల నాగేశ్వర రావు నివాసంలో జరిగిన సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ ( telangana ) లో ఈ నెల 18 నుండి రాహుల్ గాంధీ ( rahul gandhi ), ప్రియాంక గాంధీ ( priyanka gandhi )  ములుగు జిల్లా నుండి బస్ యాత్ర ( bus yatra )  నిర్వహిస్తారని తెలిపారు . బస్ యాత్రలో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా పాల్గొంటారని పేర్కొన్నారు.

Hospital

read also : డాక్టర్ల మద్దతుకై తుమ్మల వేట..

బీఆర్ఎస్ ప్రభుత్వం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నాదని పొంగులేటి విమర్శించారు. యువత తల్లి తండ్రులు కోచింగ్ సెంటర్ లకు కట్టిన డబ్బంతా బురదలో పోసిన పన్నీరు అయ్యిందన్నారు. యువత అంతా ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తొలి విడత 55 సీట్ల కు అభ్యర్థులను ప్రకటించిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నీతి నిజాయితీతో యుద్ధం లోకి దిగుతుందని, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్ యాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

read also : దేవీ నవరాత్రుల శుభతరుణంలో అమ్మవారి కి ఏ రోజు ప్రసాదాలు ఏం పెట్టాలి. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..

బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అంతా కాంగ్రెస్ పార్టీని చూసి కాపీ కొట్టిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గారెంటీ కార్డ్ లు ప్రవేశ పెడితే అవి ఇవ్వడం ఎలా సాధ్యం అన్న బీఆర్ఎస్ పార్టీ, మరి వాటినే కాపీ కొట్టి ఎలా అమలు చేయగలుగుతుందని ఎద్దేవా చేశారు. వందలాది మంది బీఆర్ఎస్ సర్పంచ్ లు, కార్పొరేటర్లు, నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు బంధి పోటు అనే పదం వాడే హక్కు ఆయనకు లేదన్నారు. మిమ్మల్ని చూసి మేము భయపడటం కాదు, మీ నాయన, తాతా ఉన్నా బీఆర్ఎస్ నాయకులను మా పార్టీలో చేర్చుకుంటాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. రాయల నాగేశ్వర రావు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేలా చర్చలు చేస్తాం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.