Read News in Telugu Language
adsdaksha

తెలంగాణ కు వర్ష సూచన.. మూడు రోజుల పాటూ వర్షాలు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మే 12

మండుతున్న ఎండలకు బెంబేలెత్తుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణ ( telangana ) లో రాగల మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ మరత్వాడ నుంచి కోమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ద్రోణి విచ్చిన్నతి ఆదివారం తూర్పు మధ్యప్రదేశ్ నుండి విదర్భ, మరాత్వాడ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో గాలులు ప్రధానంగా దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నాయని తెలిపింది.

Hospital

read also : జన సంద్రమైన ఖమ్మం.. కదం తొక్కిన కమ్యూనిస్టులు.. భారీ బైక్ ర్యాలీతో విజయ వంతంగా ముగిసిన కాంగ్రెస్ ప్రచార పర్వం..

దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ, వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమ, మంగళ వారాల్లో 30 – 40 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.