Read News in Telugu Language
adsdaksha

rain alert : తెలంగాణ కు భారీ వర్ష సూచన .. 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 5

నాలుగు జిల్లాల్లో బడులు బంద్..

నిండుకుండలను తలపిస్తున్న జలాశయాలు..

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణ శాఖ తెలంగాణ ( telangana ) లో 7 జిల్లలాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాంతో ప్రభుత్వం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు.

Hospital

read also : సిఎం కేసీఆర్ ఉపాధ్యాయ దినోత్సవం కానుక..

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి కేంద్రీకృతమైంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అల్పపీడనం వల్ల మరో వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జాలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

read also : pedda bala shiksha : మన పెద్దబాలశిక్ష పుట్టుక గురించి మీకు తెలుసా..?

హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద పోటెత్తింది. హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తివేసి 1373 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ 2 గేట్లు ఎత్తివేసి 442 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.