Read News in Telugu Language
adsdaksha

రైతులకు పంద్రాగష్టు తీపికబురు .. రుణమాఫీ కి నిధులు మంజూరు..

రూ. 99,999 లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ..

ఉత్తర్వులు జారీ.. రైతుల రుణ ఖాతాల్లో నగదు జమ..

ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం తీపికబురు అందించింది. రైతులను రుణ విముక్తి చేసే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( cm kcr) మరో దఫా రైతు రుణమాఫీ ( raithu runa mafe) కి సంబంధించిన నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాటను, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు రైతు రుణ మాఫీ పథకాన్ని ఆచరణలో పెట్టారు. రూ.లక్ష లోపు రుణాలను తీసుకున్న రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేసే దిశగా సీఎం కేసీఆర్‌ సోమవారం 99 వేల 999 రూపాయల వరకు ఉన్న అప్పులకు రైతుల తరఫున బ్యాంకులకు బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు సోమవారం ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ, రైతుల తరఫున బ్యాంకులకు డబ్బు మొత్తాన్ని తక్షణం జమ చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో 9లక్షల2వేల 843 మంది రైతులకు సంబంధించి 5809.78 కోట్ల రూపాయలను సంబంధిత అధికారులు విడుదల చేశారు.

read also : ఖమ్మం ప్రెస్ క్లబ్ లో వైఫై సేవలు ప్రారంభం..

Hospital

2018లో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2018 డిసెంబర్‌ 11 నాటికి రాష్ట్రంలో లక్ష లోపు పంట రుణాలు తీసుకున్న రైతులందరికి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఎన్నికల హామీలలో కూడా దశలవారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీకి సంబంధించిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. దాంతో సీఎం ఆదేశాలతో వ్యవసాయ, ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకులకు ప్రత్యేకంగా లేఖలు రాసి సమగ్ర వివరాలు తెప్పించుకున్నారు.

read also : దండగన్న వ్యవసాయాన్ని కేసిఆర్ పండుగ చేశారు..

ఇప్పటికే 50వేల లోపు రుణాలు 7,19,488 మంది రైతులకు సంబంధించి 1943 కోట్ల 64 లక్షల రూపాయలను బ్యాంకులకు చెల్లించిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని రైతురుణమాఫీ ఖాతాల్లో సర్దుబాటు చేసింది. ఇక మిగిలిన మొత్తం కూడా మాఫీ చేయడానికి నిధులు సమకూర్చుకున్నది. తాజాగా 99వేల 999 రూపాయల వరకు బ్యాంకులకు అప్పున్న రైతుల రుణాల మాఫీకి 5809.78 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నెల 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగం, రైతు రుణమాఫీ గురించి అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించి రైతు రుణమాఫీని అతి త్వరలోనే సంపూర్ణంగా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో 45 రోజుల్లోనే రుణమాఫీ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆగస్టు 3న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు బడ్జెట్‌ రీలిజింగ్‌ ఆర్డర్‌ (బీఆర్‌ వో) కూడా ఇచ్చారు. దాంతో ఆగస్టు 3 నుంచి రుణమాఫీకి సంబంధించిన నిధుల విడుదల మొదలయ్యింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తంగా 16లక్షల 66వేల 899 మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

 

 

Leave A Reply

Your email address will not be published.