Read News in Telugu Language
adsdaksha

telangana : తెలంగాణ లో రేపు అమిత్ షా పర్యటన..

దక్షన్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 26

సమస్యలే ప్రధాన అస్త్రాలుగా ఖమ్మంలో సభ..

ఈనెల 27న తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ( amith shah ) పర్యటించనున్నారు. కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ( kishan reddy ) పర్యవేక్షణ లో జరగనున్న అమిత్ షా టూర్ ప్రోగ్రాంలో, షా దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ (vijayawada ) చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం ( bhadrachalam ) రానున్నారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం ( khammam ) లో నిర్వహించే ‘రైతు గోస. భాజపా భరోసా’ (raitu ghosa – bjp bharosa) బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు.

Hospital

read also : greece : గ్రీస్ లో నలభై ఏళ్ళ తర్వాత భారత ప్రధాని పర్యటన..

అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా ఖమ్మంలో నిర్వహించనున్న సభలో ఆయన ప్రభుత్వ పధకాల వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టనున్నట్లు సమాచారం. ధాన్యం కొనుగోలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని, సమగ్రమైన పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారని ప్రజలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైతులకు ఉచిత ఎరువులు, వ్యవసాయ పనిముట్ల సబ్సిడీలు వంటి వాటిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కేసిఆర్ సర్కార్ మహిళా రిజర్వేషన్లను పట్టించుకోని తీరు, జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాలు వంటి విషయాలు ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.