Read News in Telugu Language
adsdaksha

రాజీవ్ గాంధీ స్పూర్తితో యువత దేశ రక్షణలో ముందుకు సాగాలి ..

జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్ ..

  1. భారత దేశ ప్రధానిగా అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి ఈ దేశం లో అనేక సంస్కరణలు చేపట్టి అభివృద్ధిలో దేశాన్ని ముందు వరుసలో నిలబెట్టిన రాజీవ్ గాంధీ ( Rajeev Gandhi )  స్పూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలని ఖమ్మం  ( khammam ) జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు యడ్లపల్లి సంతోష్ ( yadlapalli santhosh ) అన్నారు. మంగళవారం ఖమ్మం కాంగ్రెస్ ( congress)  పార్టీ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంతోష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృష్ట్యా యూత్ కాంగ్రెస్ అంతర్గత అంశాలు, పార్టీ ఆదేశం మేరకు చేపట్టిన యూత్ జోడో బూత్ జోడో డోర్ టూ డోర్ క్యాంపెనింగ్, సోషల్ మీడియా ద్వారా పార్టీ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధానం పై నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

Hospital

జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మయూరి సెంటర్ లో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈసందర్భంగా యడ్లపల్లి సంతోష్ మాట్లాడుతూ
18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించినా, సాంకేతిక విప్లవానికి నాంది పలికినా, అది రాజీవ్ గాంధీ కే చెందుతుందన్నారు. దేశంలో విద్యావంతుల శాతం పెంపొందించేందుకు జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించినట్లు తెలిపారు. 1986లో జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించారని వెల్లడించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధారిత విద్యా సంస్థ, ఇది గ్రామీణ జనాభాకు ఆరు నుండి పన్నెండు తరగతుల వరకు ఉచిత రెసిడెన్షియల్ విద్యను అందించిందన్నారు. సమాచార వ్యవస్థ బలోపేతం కోసం టెలికమ్యూనికేషన్స్ రంగాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామ గ్రామాన PCO పెట్టి టెలిఫోన్ వాడకం ధనికులకే కాదు సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారన్నారు. ఇలా అనేక సంస్కరణలు చేపట్టి భారత దేశం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకుని నిలబడే స్థాయికి చేరుకుంది అంటే దానికి రాజీవ్ గాంధీ ముందు చూపే కారణం అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు కొండూరి హృదయ్ కిరణ్ ,పమ్మి అశోక్, రాజీవ్ గాంధీ, మసకట్ల రాధాకృష్ణ ,బానోత్ రాజేష్, మారుతి కోటి, భూక్యా రవి, భూక్యా అనిల్ లాల్, భుక్యా బద్రు నాయక్ ,వినుకొండ రాంబాబు, మహమ్మద్ ఫక్రుద్దీన్, నితీష్ రానా (సన్నీ),జి.ఉదయ్ కుమార్, సైదాన్ రావు, గంగరాజు,దారెల్లి రాకేష్, జేవి రత్నం బాబు, బానోత్ నరసింహ, పి జాన్ పాషా, ఎం.సీతారాములు, ఏ దుర్గాప్రసాద్, టి.గణేష్ బాబు, ఎస్ కే రహీమా, దామాల సురేష్ బాబు, షేక్ లాల్ హిం మహమ్మద్, కుర్నవల్లి అశోక్, ఇద్దెగాని వీరబాబు, కార్తీక్ ఏ.వెంకటేష్ మాధవరావు, వి.మురళీకృష్ణ, జె.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.