Read News in Telugu Language
adsdaksha

గుండెనిండింది.. మనసు పొంగింది..పొంగులేటి నిలయం లో రక్షాబంధన్ వేడుకలు..

దక్ష న్యూస్, ఖమ్మం: ఆగస్ట్ 31

మహిళలతో కిక్కిరిసిన శ్రీనివాసరెడ్డి క్యాంప్ ఆఫీస్..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొంగిపొర్లిన అభిమానం..

రాఖీలు కట్టి సంతోషం వ్యక్తం చేసిన మహిళలు..

సోదర బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ( rakshabandhan ) పర్వదినాన్ని పురస్కరించుకొని తమ ఆత్మీయ సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) కి రాఖీలు కట్టేందుకు గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా మహిళలు బారులు తీరారు. ఆయన ఇప్పుడంటే కాంగ్రెస్ ( congress ) పార్టీ నాయకుడు కానీ ఎప్పటినుండో మా ఆత్మీయ సోదరుడు అంటూ మహిళలు ఎంతో ప్రేమాభిమానాలతో ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లా నలుమూలలనుండి వచ్చి రాఖీలు కట్టి శ్రీనివాసరెడ్డితో ముచ్చటించారు. అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎవరినోట విన్నా ఒక్కటే మాట, శీనన్న మాకు ఎప్పటినుండో తెలుసు. మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళ జరిగినా, ఎదైనా ఆపద వచ్చినా ఖచ్చితంగా వచ్చి దైర్యం చెప్పి వెళతారు అని మహిళలు మాట్లాడుకోవడం వారికి ఆయన పట్ల ఉన్న అభిమాన్ని చాటి చెప్పింది. నిజంగా వీరందరికి శీనన్న తెలుసా అని పలకరిస్తే.. ఒక్కొక్కరూ తమ ఇంట్లో జరిగిన ఒక్కో సంఘటన గురించి చెపుతూ శ్రీనివాసరెడ్డి అంటే మాకు అత్యంత ఆత్మీయుడు అనే భావం వ్యక్తం చేయడం సంబ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

Hospital

read also : panchangamu : పంచాంగము.. రాశీ ఫలాలు..

 

పార్టీలతో పనిలేదు మాకు శీనన్న అంటే తోబుట్టూవుతో సమానం అని వచ్చి రాఖీలు కట్టిన వారు కనిపించారు. భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, తల్లాడ, వైరా, మధిర, అశ్వరావుపేట, మణుగూరు, ఇల్లందు, పాలేరు, ఒక్కటేంటి అన్ని నియోజకవర్గాల్లోని మహిళలు మారు మూల గ్రామాలకు చెందిన మహిళలు తెల్లవారుజామునే తమ సోదరులకు రాఖీలు కట్టి బయల్దేరి వచ్చిన వారు కొందరైతే, శీనన్న ఉదయం 11గం. లవరకే క్యాంప్ ఆఫీస్ లో ఉంటారట అని హడావిడిగా బయల్దేరి వచ్చిన వారు ఎందరో. ఎవరి చేతుల్లో చూసినా స్వీట్ బాక్స్లులు, రాఖీలు, కుంకుమ పొట్లాలు కార్యాలయ సిబ్బంది కుంకుమ, అక్షింతలు సిద్దం చేసి ఉంచినా కొందరు మహిళలు మాత్రం తమతో తెచ్చుకున్న కుంకుమను శ్రీనివాసరెడ్డి నుదుటన పెట్టి తమతో తెచ్చుకున్న రాఖీని అపురూపంగా శీనన్న చేతికి కట్టి ఆశీస్సులు అందుకున్నారు.

ఆడపడుచుల్ని మనసారా ఆశీర్వదించిన శ్రీనివాసరెడ్డి..

తనపై ఎంతో ప్రేమాభిమానాలతో రెండు జిల్లాలనుండి తరలి వచ్చిన మహిళల్ని చూసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తన చేతికి రక్ష కట్టిన ప్రతీ మహిళలను ప్రేమగా పలకరించి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. అమ్మా నాన్నల వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆడపడుచుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకునేదే సోదర బంధమని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒకరి కోసం ఒకరు గా జీవిస్తూ, ప్రేమాభిమానాలు పంచుకుంటూ… జీవితమంతా అండదండగా నిలిచే బంధానికి గుర్తే రాఖీ వేడుక అని వ్యాఖ్యానించారు. మీకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. స్వీట్ బాక్స్, కొంత నగదు ఇచ్చి ఆశీర్వదించారు. శీనన్నకు రాఖీ కట్టి ఆయనతో మాట్లాడిన ఆనందంలో మహిళలు సంతోషంగా వెనుదిరిగారు. కార్యాలయ సిబ్బంది వచ్చిన వారికి ఏర్పాట్లు పర్యవేక్షించారు.

read also : రాజదానిలో వార్డు ఆఫీస్ లు .. ప్రారంభించిన మంత్రి తలసాని..

 

Leave A Reply

Your email address will not be published.