Read News in Telugu Language
adsdaksha

ఘనంగా మాత రమాబాయి, బెల్లి లలిత వర్థంతి ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 27

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సతి మణీ, గాయని బెల్లి లలిత వర్ధంతి సోమవారం వీర నారి మణుల ఆశయ సాధన సమితి ఆద్వర్యంలో ఆ సంఘం కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు తొలుత రమా బాయి, బెల్లి లలిత చిత్ర పటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు భూక్యా ఉపేంద్ర బాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షురాలు షేక్. నజీమా , సంఘం గౌరవ సలహాదారులు యాక లక్ష్మి , నాగమణి లు మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎదుగుదల వెనుక మాత రమాబాయి ( ramabhai ) పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు.

మలి దశ తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో బెల్లి లలిత పోషించిన పాత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిందని భూక్యా ఉపేంద్ర బాయి పేర్కొన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ పాత్ర ఉంటుందనే విషయానికి మాత రమాబాయి జీవితం మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా ప్రతి రంగంలో స్త్రీల కు అవకాశం లభిస్తే తమ ప్రతిభను నిరూపించుకుంటారని అన్నారు.

Hospital

read also : వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్‌ అప్‌గ్రేడ్ అవుతోంది.. ఇక లాంగ్ వాయిస్ నోట్‌లు అందుబాటులోకి..

తెలంగాణా ఉద్యమంలో ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించి గాయని బెల్లి లలిత సైతం మహిళల శక్తిని నిరూపించారని కొనియాడారు. మాతా రమాబాయి మరణించి నేటికి 89 సంవత్సరాలు కాగా , బెల్లి లలిత హత్య గావించబడి 25 సంవత్సరాలు గడిచి పోయినా నేటి తరం మహిళలకు వారు స్ఫూర్తి ప్రదాతలు గానే నిలిచిపోయారని అన్నారు. మహిళల హక్కుల సాధనకు, సాధికారతకు మాతా రమా బాయి , గాయని బెల్లి లలిత చూపిన మార్గం మనకు ఆదర్శ ప్రాయమన్నారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడాల జ్యోతి , ఉపాధ్యక్షురాలు చందు, కార్యదర్శి జ్యోతి , సహాయ కార్యదర్శి లలితా బాయి , నాయకురాలు త్రివేణి , భవాని ,శృతి ,ఉష ,శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.