Read News in Telugu Language
adsdaksha

నా ప్రజల సేవే లక్ష్యం: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ..

దక్ష న్యూస్, ఖమ్మం: ఏప్రిల్ 28

నా సొంత జిల్లా అయిన ఖమ్మం లో నా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యమని, అందుకే ఎంపీ గా పోటీ చేశానని కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy )  అన్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచే ఖమ్మం లో ప్రచారం చేపట్టారు. తొలుత 14వ డివిజన్ లోని గొల్లగూడెం ఈద్గా మైదానంలో వాకర్లతో కలిసి నడిచారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. ముచ్చటించారు. స్థానికంగా కమతం రామకృష్ణ నివాసానికి వెళ్లి..తేనీరు స్వీకరించారు.

Read also: లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కారు..తుక్కు తుక్కే : మంత్రి పొంగులేటి ..

Hospital

కూరగాయల వ్యాపారులతో రఘురాం ముచ్చట్లు..

రాపర్తి నగర్ లోని కూరగాయల మార్కెట్ సందర్శనలో వ్యాపారులతో రఘురాం ముచ్చటించారు. దుకాణం.. దుకాణానికి తిరిగి హస్తం గుర్తుపై ఓటేసి .. భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రాంగణంలో మాజీ కార్పొరేటర్ తోట రామారావు షాప్ కు వెళ్లి ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వ్యాపారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. తన స్వగ్రామం కూసుమంచి మండలం చేగొమ్మ అని, ఖమ్మంలో గృహం ఉందని అన్నారు. ఎంపీ గా జిల్లా ప్రజలకు నేరుగా ప్రజా సేవ చేసుకుంటానని తెలిపారు. ఆయన రాకను స్వాగతిస్తూ కళాకారులు పూలు జల్లుతూ.. కోలాటం నృత్యాల నడుమ ఘన స్వాగతం పలికారు.


Read also: మీతో నడుస్తా.. అండగా నిలుస్తా : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ..

కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రఘురాం వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, మాజీ కార్పొరేటర్ దీపక్ చౌదరి, రైట్ ఛాయిస్ అధినేత మెండెం కిరణ్, నాయకులు మియా భాయ్, కమతం రామకృష్ణ, బండి నాగేశ్వరరావు, మల్లేపల్లి సర్పంచ్ బండి వెంకన్న, బొమ్మిడి శ్రీనివాస్, సాయికిరణ్, తోట ప్రసాద్, షరీఫ్, యోగా గురువు బోస్, వడ్డేబోయిన శ్రీనివాసరావు, తాళ్లూరి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.