Read News in Telugu Language
adsdaksha

మైనారిటీలకు అండగా నిలుస్తా: రఘురాం రెడ్డి ..

దక్ష న్యూస్, సత్తుపల్లి : ఏప్రిల్ 29

సాయి వెంకట్ మొగుదుంపురం, నెట్ వర్క్ ఇన్ చార్జ్ : దక్ష న్యూస్

మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy ) అన్నారు. సోమవారం ఆయన సత్తుపల్లి ( sattupalli ) లో జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి ( matta ragamai ) తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల రాజకీయాలు చేయడం బాధాకరమని అన్నారు. ఎవ్వరూ అధైర్య పడవద్దని కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం భారీ విజయం సాధిస్తారని పాస్టర్లు రఘురాం రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Hospital

read also : ఆగమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ..

ఉప ముఖ్యమంత్రిని కలిసిన రఘురాం రెడ్డి ..

ఖమ్మం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ను కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి సోమవారం కలిశారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి ఖమ్మంలోని భట్టి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పారు. ఈ సందర్భంగా భట్టి..రఘురాం రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి..ప్రచార సరళిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.