Read News in Telugu Language
adsdaksha

జన సంద్రమైన ఖమ్మం.. కదం తొక్కిన కమ్యూనిస్టులు.. భారీ బైక్ ర్యాలీతో విజయ వంతంగా ముగిసిన కాంగ్రెస్ ప్రచార పర్వం..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 11

ఖమ్మం నగరం కదిలొచ్చిన తెలుగు తమ్ముళ్ళు .. కామ్రేడ్ ల కదన ఉత్సాహంతో జన సంద్రమైంది. ఎటుచూసినా జనమే..కాంగ్రెస్ గెలుపు కోసం జయజయధ్వనాల మధ్య కార్యకర్తల నినాదాల నడుమ సందడిని సంతరించుకుంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy ) భారీ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దాంతో ఉమ్మడి ఖమ్మం ( khammam ) జిల్లా వ్యాప్తంగా కదిలివచ్చిన కాంగ్రెస్ ( congress )  శ్రేణులతో నగరం కొత్త శోభను సంతరించుకుంది. వందలాది బైకులతో.. ఆయా పార్టీల జెండాలను రెపరెపలాడిస్తూ చేపట్టిన ర్యాలీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

read also : ఎన్ఎంసి టీఎస్ఎంసి దాడులపై జిల్లా మంత్రులు స్పందించాలి.. ఆర్ఎంపి సంఘాల నాయకులు విజ్ఞప్తి..

ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు..

నగరంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ ఆర్ కళాశాల ఎదుట ప్రధాన రహదారిపై ఈ బైక్ ర్యాలీ శనివారం సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రెట్టించిన ఉత్సాహంతో వందలాది బైకులు.. రయ్ న ముందుకు దూసుకుపోతుండగా.. శ్రేణులు కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రదర్శన ఇల్లెందు క్రాస్ రోడ్, వీఆర్ కే సిల్క్స్, మమత రోడ్, చెరువు బజార్, చర్చి కాంపౌండ్, శ్రీనివాస నగర్, వ్యవసాయ మార్కెట్, పీఎస్ఆర్ మార్గ్, కాల్వొడ్డు, మయూరి సెంటర్, బస్ డిపో, రాపర్తి నగర్ మీదుగా సాగి.. ఎన్టీఆర్ సర్కిల్లో ముగిసింది. ఎన్నికల నియమావళిని పాటిస్తూ.. నిర్దేశించిన సమయంలోపు విజయవంతం చేశారు.

Hospital

read also : ఆ రెండు పార్టీలూ ఒక తాను ముక్కలే.. కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు : మంత్రి పొంగులేటి..

అన్ని ప్రాంతాల్లో ప్రజలు ర్యాలీకి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. మంత్రులు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహమ్మద్ జావేద్, వామపక్ష, టీడీపీ నాయకులు అందరికీ అభివాదం చేస్తూ.. మరింత ఉత్సాహం నింపారు.


రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం..

ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధాన మంత్రి చేసుకుందామని అన్నారు. ఈనెల 13వ తేదీన అందరూ బాధ్యతగా తమ తమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి.. హస్తం గుర్తుపై ఓటేసి.. ఘన విజయాన్ని అందించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.