Read News in Telugu Language
adsdaksha

మీతో నడుస్తా.. అండగా నిలుస్తా : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి ..

దక్ష న్యూస్, ఖమ్మం: ఏప్రిల్ 27

వాకర్స్ తో అడుగులేశారు. యూత్ తో క్రికెట్ అడారు.. తెలతెలవారుతుండగా..మెడలో కాంగ్రెస్ కండువా వేసుకుని..అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. వాకర్లతో అడుగులేస్తూ..కబుర్లు చెపుతూ ఉత్సాహం నింపారు.

సీపీఐ, సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuram reddy )  శనివారం ఉదయం 6 గంటల నుంచే ప్రచార పర్వం మొదలెట్టారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మువ్వా విజయ బాబు, నిరంజన్ రెడ్డి లతో కలిసి నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ వాకింగ్ చేస్తున్న వారితో కలిసి ..ముందుకు నడుస్తూ.. అక్కా, అన్నా అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ.. హస్తం గుర్తుపై ఓటేసి.. తనను భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు.

Read also : సీఎం జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల.. తొమ్మిది కొత్త విషయాలతో అదిరిపోయే హామీలు..

Hospital

మైదానంలో క్రీడాకారులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడి, ఇండోర్ షటిల్ కోర్టులో గేమ్ ఆడి అందరినీ ఉత్సాహ పరిచారు. మైదానం లో సీపీఎం సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, సుబ్బారావు తదితరులు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రఘురాం రెడ్డి వాకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రజాసేవకే పోటీ చేస్తున్నానని, అందరికీ అండగా ఉంటానని అభయమిచ్చారు.

పటేల్ స్టేడియం కి వెళ్ళిన వారిలో ఆయన వెంట కాంగ్రెస్ నగర అధ్యక్షులు మొహమ్మద్ జావిద్, కార్పొరేటర్లు చావా నారాయణ, మిక్కిలినేని మంజుల నరేందర్, నాయకులు కొత్త సీతారాములు, కొప్పుల చంద్రశేఖర రావు, మద్ది కిషోర్ రెడ్డి, హుస్సేన్, వడ్డెబోయిన శ్రీనివాస్, నెల్లూరు చంద్రయ్య, వాకర్స్ క్లబ్ బాధ్యులు మలీదు నాగేశ్వరరావు, కేతినేని కృష్ణారావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.