Read News in Telugu Language
adsdaksha

ఓటు హక్కు వినియోగించుకున్న పొంగులేటి బ్రదర్స్.. మాదాపురంలో ఓటేసిన రఘురాం రెడ్డి..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 13

తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు ప్రసాద రెడ్డి సోమవారం కల్లూరు మండలం నారాయణపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ramasahayam raghuramreddy ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం మహబూబాబాద్ మండలం మాదాపురం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం(బూత్ నంబర్ 282) లో ఓటేశారు.

పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన రఘురాం రెడ్డి ..

Hospital

ఖమ్మం నగరంలోని నృసింహస్వామి దేవాలయానికి సోమవారం ఉదయం వెళ్లిన .. రామ సహాయం రఘురాం రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 57 వ డివిజన్ లోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత బొక్కలగడ్డ, సుందరయ్య నగర్, శ్రీనివాస నగర్, ముస్తఫా నగర్, తుమ్మల గడ్డ, మామిళ్ళగూడెం, వీడివోస్ కాలనీ, బల్లేపల్లి, పాండురంగాపురం, రఘునాథపాలెం మండలం మంచుకొండ, ఈర్లపూడి, వీవీ. పాలెం, చింతకాని మండలం పొద్దుటూరు, చింతకాని, బోనకల్ మండలం రావినూతల, జానకీ పురం, వైరా మండలం పాలడుగు వైరా, రెబ్బవరం, తల్లాడ, ఏన్కూరు మండల కేంద్రాలు, జూలూరు పాడు మండలం పడమటి నరసింహాపురం పోలింగ్ సెంటర్లను సందర్శించారు.

read also : బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు.. ముస్లిం ఓట్లను పోలరైజ్ చేయడానికి బిజేపి ప్రయత్నిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి..

ఎన్నికల నియమావళిని పాటిస్తూ.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని రఘురాం రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, నాయకులు బొర్రా రాజశేఖర్, తదితరులు ఉన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.