Read News in Telugu Language
adsdaksha

Randomisation Software : సాంకేతిక పరి జ్ఞానం తో లబ్దిదారుల ఎంపిక..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఆగస్ట్ 24

దేశంలోనే మొదటిసారి ఆన్ లైన్ డ్రా..

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం….

సొంత ఇల్లు లేని పేదల కల నెరవేర్చడం తెలంగాణ ( telangana ) ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) అన్నారు. హైదరాబాద్ ( hyderabad ) కలెక్టర్ కార్యాలయంలో గురువారం మంత్రి ఆన్ లైన్ డ్రా పద్దతిలో డబుల్ బెడ్ రూమ్ ( double bedroom ) లబ్ధిదారుల ఎంపికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, అమయ్ కుమార్ పాల్గొన్నారు.

Hospital

read also : జయహో .. భారత్.. వెల్లువెత్తిన అభినందనలు..వాడ వాడలా సంబరాలు..

సెప్టెంబర్ 2 న కుత్బుల్లాపూర్ లో మున్సిపల్ మంత్రి కెటిఆర్ ( KTR) లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయనున్న సందర్భంగా లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశంలోనే మొదటిసారి ఆన్ లైన్ డ్రా NIC రూపొందించిన Randomisation Software ద్వారా చేపట్టినట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో నుండి లబ్ధిదారుల ఎంపిక చేశామన్నారు.

హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో మొదటివిడతలో 12 వేల మందికి ఇండ్ల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు నామమాత్రపు ఆర్ధిక సహాయంతో ఇండ్లను నిర్మించాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందిస్తున్నారని మంత్రి తెలిపారు.

read also : thursday : గురువారం ఎవరిని పూజించాలో తెలుసా..

Leave A Reply

Your email address will not be published.