Read News in Telugu Language
adsdaksha

పెద్దనోట్లు 97.69 శాతం వచ్చినయ్ ..రద్దయిన రూ.2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 2

రూ.2వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం 2023, మే 19న రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రూ.2వేల నోట్లను బ్యాంకులు, ఆర్‌బీఐ (rbi ) కేంద్రాల్లో మార్పిడి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే ఇప్పటివరకు 97.69 శాతం రూ.2వేల నోట్లు వెనక్కి వచ్చినట్టు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.8,202 విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్టు చెప్పింది.

Read also: వరంగల్ బరిలో కడియం కావ్య..ప్రకటించిన అధిష్టానం..

Hospital

నిజానికి పెద్ద నోట్లను రద్దు చేసే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2 వేల నోట్ల చలామణిలో ఉన్నాయి. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు, మార్చుకునేందుకు ఆర్బీఐ పలు విడతలుగా వెసులుబాటు కల్పించింది.

Read also: కడియం వెళ్లాక పార్టీలో ఉత్సాహం పెరిగింది : హరీశ్ రావు

2024, మార్చి 29 నాటికి మార్కెట్లో చలామణిలో ఉన్న 2 వేల నోట్ల విలువ రూ.8,202 కోట్లకు గణనీయంగా తగ్గినట్టు ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, ముంబై, నాగపూర్, ఢిల్లీ, పాట్నా, తిరువనంతపురం, రాంచీ, రాయపూర్ ఆర్బీఐ కేంద్రాల వద్ద మాత్రమే ప్రస్తుతం 2 వేల నోట్ల ఎక్స్ఛేంజ్ జరుగుతోంది.

Leave A Reply

Your email address will not be published.