Read News in Telugu Language
adsdaksha

Realme C53 : కొత్త ఫోన్ కొనాలనుకుంటుంన్నారా.. రియల్‌మి ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 2,550 లకే ..

అదెలాగో తెలుసుకోండి..

కొత్త ఫోన్ కొనాలనుకుంటుంన్నారా.. అదీ తక్కువ బడ్జెట్ లో .. ఇప్పుడు రియల్ మి ఫోన్ సి 53 ( Realme C53 ) ధర భారీగా తగ్గింది. మీరు ఖచ్చితంగా కొనాలనుకుంటే ఇప్పుడు తక్కువ ధరకే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. రియల్‌మి C53 ఇప్పుడు కేవలం రూ. 2,550కే ఫోన్ సొంతం చేసుకోవచ్చు. బ్యాంకు ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. అదెలాగో ఆఫర్ ఏంటో తెలుసుకుందాం.

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి వినియోగ దారులకోసం సరికొత్త ఫోన్ (Realme C53)పై అద్భుతమైన డిస్కౌంట్ అందుబాటులోకి తెచ్చింది. రియల్‌మి ఫోన్‌‌పై ఈ అద్భుతమైన ఆఫర్‌ను ఇ-కామర్స్ సైట్‌ (Flipkart) అందిస్తోంది. ఇప్పుడు ఈ రియల్‌మి C53 ఫోన్ రూ.12,999కి బదులుగా రూ.10,999గా సొంతం చేసుకోవచ్చు. రియల్‌మి C53 మంచి 15శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ రియల్‌మి ఫోన్‌లో బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్‌లను కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా అయితే రూ.10,450 వరకు ఆదా చేయవచ్చు.

read also : అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ తిరుపతి మన్యంకొండ ..

Hospital

స్పెసిఫికేషన్స్ :

చైనా స్మార్ట్ ఫోన్ రియల్‌మి C53 ఫోన్ 6.74-అంగుళాల IPS LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్‌ల HD+ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ స్క్రీన్ పైభాగంలో 260 PPI వాటర్‌డ్రాప్ నాచ్‌తో వస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే స్క్రీన్ అన్ని వైపులా సన్నని బెజెల్స్‌తో వస్తుంది. 560 నిట్‌ల ప్రకాశం, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంది. ఆక్టా-కోర్ 1.8GHz Unisoc T612 CPU, Mali-G57 GPU రియల్‌మి C53ని అమలు చేస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 6GB RAM ఉన్నాయి.

రియల్‌మి C53 వెనుక, 2 కెమెరాలు ఉన్నాయి. కెమెరా మాడ్యూల్‌లో f/1.79 ఎపర్చరు, 11080p వీడియో రికార్డింగ్ సామర్థ్యాలతో 50MP ప్రైమరీ కెమెరా వచ్చింది. ప్రాథమిక 50MP కెమెరాతో పాటు 0.3MP డెప్త్ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు రియల్‌మి C53 ఫోన్ f/2.0 ఎపర్చర్‌తో 5MP కెమెరాను కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు 5,000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది.

 

Leave A Reply

Your email address will not be published.