Read News in Telugu Language
adsdaksha

బిఆర్ఎస్ మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

దక్ష న్యూస్, మణుగూరు : అక్టోబర్ 25

గడపగడపకు గులాబీ సేన..

పినపాక నియోజకవర్గం గడ్డపై గులాబీ జెండా ఎగరేద్దాం..

పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్ ( cm kcr ) కే దక్కుతుందని తెలంగాణ ( telangana ) రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ( rega kantharao ) అన్నారు. తనను మూడోసారి ఆశీర్వదిస్తే పినపాక  ( pinapaka ) నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ( manuguru ) మండలం లో బుధవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు, వృద్ధులు ఆప్యాయంగా పలకరించి కొడుకా నీకే మా ఓటు అని చెప్పారు, కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు…

read also : పాలేరు ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నా.. బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి..!

Hospital

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా జీవిత లక్ష్యం అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని రంగాలలో అభివృద్ధి చేసినట్లు రేగా తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన బిఆర్ఎస్ నూతన మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు జరుతుందని రేగా కాంతారావు తెలిపారు. మండలం లో ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మూడోసారి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాల అమలులో చరిత్ర సృష్టిస్తుందన్నారు.

పినపాక నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ కే పట్టం కట్టాలని రేగా కాంతారావు కోరారు. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం వెనుకంజలో ఉండేదని రాష్ట్ర ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దూసుకు వెళ్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, ప్రస్తుతం రైతులకు ఎకరానికి రూ. 10,000 ఇస్తుండగా వాటిని 16 వేలకు పెంచినట్లు తెలిపారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద రెండు లక్షలు, గ్యాస్ సిలిండర్ రూ.400 కే ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు తెలిపారు.

read also : పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి భాద్యత : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ..

సౌభాగ్య లక్ష్మి పథకం కింద ప్రతి పేద మహిళలకు 3 వేలు, దివ్యాంగులకు 6 వేలు చెల్లిస్తామన్నారు. పేదలకు తెల్ల రేషన్ కార్డు ద్వారా దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా పథకం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా ఈవిధంగా రైతులకు రైతుబంధు 24 గంటల విద్యుత్ అందిస్తున్న రాష్ట్రాలు లేవన్నారు. ఒక తెలంగాణలోనే సీఎం కేసీఆర్ ఈ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కులవృత్తులను బలోపేతం చేసి వారు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు.

 

 

 

Leave A Reply

Your email address will not be published.