Read News in Telugu Language
adsdaksha

రాజమౌళిపై రేణుదేశాయ్ స్పెషల్ పోస్ట్..

దక్ష సినిమా న్యూస్:

ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందటం చాలా అద్భుతంగా ఉందని, రాజమౌళి ( rajamauli ) సర్ మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావట్లేదని పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ( renu deshay ) షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శనివారం నార్వే ( norway ) లోని స్టావెంజర్‌ థియేటర్ ( stavanger theatre ) లో బాహుబలి ( bahubali ) సినిమా స్పెషల్ షో ప్రదర్శించారు. షో అనంతరం అక్కడున్న వారంతా దాదాపు పది నిముషాలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి రాజమౌళిని అంభినందించారు. ఆ దృశ్యాన్ని రేణు దేశాయ్ వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా స్టావెంజర్‌ థియేటర్లో బాహుబలి సినిమా చూసిన అనుభవం మర్చిపోలేను. ఈ కార్యక్రమానికి నన్ను, అకిరా ( akira) ని ఆహ్వానించినందుకు శోభు సర్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపింది రేణు దేశాయ్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Hospital

read also : యోధుడిగా నిఖిల్ సిద్దార్థ..

నార్వేలోని ప్రముఖ థియేటర్ స్టావెంజర్‌ లో బాహుబలి స్పెషల్ షో వేస్తున్న విషయం రాజమౌళి గత కొంతకాలం క్రితమే ప్రకటించారు. ఈ స్పెషల్ షోకి రాజమౌళి, రమా రాజమౌళి, రాఘవేంద్ర రావు, నిర్మాత శోభు, మరికొంతమంది రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు వెళ్లారు. వీరితో పాటు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, తనయుడు అకిరా కూడా హాజరయ్యారు. అయితే ఇటీవల పవన్ గురించి మాట్లాడుతూ వార్తల్లో నిలిచిన అతడి మాజీ భార్య రేణు దేశాయ్ ఇప్పుడు రాజమౌళి గురించి, బాహుబలి సినిమాల గురించి పెట్టిన పోస్టు షోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.