Read News in Telugu Language
adsdaksha

వడ్డీ రేట్లు కొనసాగింపు .. ఏడోసారి యథాతథం చేసిన ఆర్బీఐ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఏప్రిల్ 5

ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ( reserve bank of india ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ ( shakthi kanthadas ) శుక్రవారం వెల్లడించారు.

భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Hospital

read also : ఠారెత్తిస్తున్న ఎండలు.. 43డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత ..

ద్రవ్యపరపతి విధాన కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించేందుకు బలమైన వృద్ధి అవకాశాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని లక్షిత పరిధి అయిన 4 శాతానికి తీసుకువచ్చేందుకు ఎంపీసీ కట్టుబడి ఉంది. ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

గ్లోబల్ జీడీపీ ( global gdp ) లో రుణాల నిష్పత్తి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం ఉండొచ్చు. గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ, సేవల రంగాలలో స్థిరమైన వృద్ధి ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమివ్వనుంది.

Leave A Reply

Your email address will not be published.